నేతాజీ అస్థికలు తీసుకురండి: అనితా బోస్

by Hajipasha |
నేతాజీ అస్థికలు తీసుకురండి: అనితా బోస్
X

కోల్‌కతా: నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూతురు అనితా బోస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి అస్థికలు దేశాన్ని తీసుకురావాలని మరోసారి పునరుద్ఘాటించారు. కోల్‌కతాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సోమవారం ఆమె మాట్లాడారు. సాంకేతిక గొప్ప అభివృద్ది చెందిందని, అవసరమైతే అవశేషాల నుంచి డీఎన్ఏ పరీక్ష చేపట్టాలని ఆమె పేర్కొన్నారు. ఆలయ యాజమాన్యం, జపనీస్ ప్రభుత్వం ఆస్థికలను పరిక్షీంచి, ఇవ్వడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రజలు నేతాజీ అస్థికలను తీసుకువచ్చేందుకు మద్దతుగా ఉండాలని కోరారు. నేతాజీకి దేశ స్వాతంత్ర్యం కన్నా, ఏది ఎక్కువ కాదని అన్నారు. ఆయన స్వాతంత్ర్య భారతంలో లేకపోయినా, అస్థికలైన తిరిగి మాతృభూమికి తీసుకురావాలని తెలిపారు. కాగా 1945, 1946లో చేసిన స్పష్టమైన దర్యాప్తుల ఆధారంగా నేతాజీ 1945 ఆగస్టు 18న మరణించారు. ఆయన విమాన ప్రమాదంలో మరణించగా ఆస్థికలను టోక్యోలోని రెంకోజి ఆలయంలో భద్రపరిచినట్లు పేర్కొంది.

Advertisement

Next Story