- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
BREAKING: బాంబే హైకోర్టు సంచలన తీర్పు.. ఫేక్ ఎన్‌కౌంటర్ కేసులో పోలీసు అధికారికి జీవిత ఖైదు
దిశ, వెబ్‌డెస్క్: 2006 నాటి లఖన్ భయ్యా బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో దాఖలైన పలు పిటిషన్లపై బాంబే హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ మేరకు పోలీసు అధికారి ప్రదీప్ శర్మకు జీవిత ఖైదును విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. వివరాల్లోకి వెళితే.. వసాయి నివాసి లఖన్ భయ్యా (౩౩) అలియాస్ రాం నారాయణ్ గుప్తా అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ ముఠాలో అతడు కీలక సభ్యుడు. అయితే ముంబైలోని వెర్సోవా ప్రాంతంలో అతడిపై కాల్పులు జరిగాయి. ఆ ఎన్‌కౌంటర్‌కు మాజీ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ప్రదీప్ శర్మ నాయకత్వం వహించినట్లు ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. దీంతో 2013లో సెషన్స్ కోర్టు ఈ కేసులో 13 మంది పోలీసులతో సహా 21 మందిని దోషులుగా నిర్ధారించి అందులో ప్రదీప్ శర్మను మాత్రం నిర్దోషిగా ప్రకటించింది. మిగతా దోషులందరికీ జీవిత ఖైదు విధించారు.
ఈ క్రమంలోనే మృతుడు రాం నారాయన్ గుప్త సోదరుడు ప్రదీప్ శర్మను నిర్దోషిగా విడుదల చేయడం పట్ల మరోసారి కోర్టుకు వెళ్లాడు. అతను మరణించిన వ్యక్తిపై కాల్పులు జరిపినట్లు నిరూపించడానికి బాలిస్టిక్ డిపార్ట్‌మెంట్ నివేదికలను కోర్టుకు అందజేశాడు. అతడు ఎన్‌కౌంటర్ టీంకు నాయకత్వం వహించాడని ఆరోపించారు. అదేవిధంగా లఖన్ భయ్యా కిడ్నాప్‌కు కూడా ప్రధాన కారణమని వెల్లడించారు. రాం నారాయణ్ గుప్త హత్యకు ప్రధాన కుట్రదారు, ఆపరేషన్ చీఫ్ ప్రదీప్ శర్మనే అని వాదించారు. అదేవిధంగా ఎన్‌కౌంటర్ సమయంలో ప్రదీప్ శర్మ ఇతర నిందితులతో టచ్ ఉన్నట్లుగా కాల్ రికార్డులను కోర్టుకు అందజేశారు. దీంతో ఇరు పక్షాల వాదనలు విన్న బాంబే కోర్టు పోలీసు అధికారి ప్రదీప్ శర్మకు జీవిత ఖైదును విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది.