- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేంద్ర హోంశాఖ కార్యాలయానికి బాంబ్ బెదిరింపు.. నార్త్ బ్లాక్ పేల్చేస్తామని వార్నింగ్..!
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ దేశ రాజధాని ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ కార్యాలయానికి బాంబ్ బెదిరింపు మెయిల్ తీవ్ర కలకలం రేపింది. కేంద్ర హోంశాఖ కార్యాలయంలోని నార్త్ బ్లాక్‌ను బాంబులతో పేల్చేస్తామంటూ బుధవారం పోలీస్ కంట్రోల్ రూమ్‌కు గుర్తు తెలియని నెంబర్ నుండి ఈ-మెయిల్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. బాంబ్ థ్రెట్ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు, కేంద్ర బలగాలు, బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి. నార్త్ బ్లాక్‌లో బాంబ్ స్వ్కాడ్ వెంటనే తనిఖీలు చేపట్టింది. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మెయిల్ ఎక్కడి నుండి వచ్చిందనే దానిపై దర్యాప్తు చేపట్టారు.
బాంబు బెదిరింపు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా ముందస్తు చర్యల్లో భాగంగా హోంశాఖ ఆఫీస్ నార్త్ బ్లాక్ వద్ద పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. గుజరాత్ ఎయిర్ పోర్టులో మంగళవారం నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడటం.. ఇవాళ ఏకంగా కేంద్ర హోంశాఖ కార్యాలయానికే బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులు హై అలర్ట్ అయ్యారు. దేశ రాజధానిలోని కీలక ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.