- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ సంచలన ఆరోపణలు.. అసలు ప్రియాంకా గాంధీ ఆస్తి ఎంతో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) ఆస్తులపై బీజేపీ(BJP) సంచలన ఆరోపణలు చేసింది. భూముల అవకతవకల్లో ఆమె హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇదే అంశంపై గురువారం బీజేపీ నేత ప్రదీప్ బండారి(Pradeep Bhandari) మీడియాతో మాట్లాడారు. అసలు ప్రియాంకా గాంధీకి ఆదాయం ఎక్కడినుంచి వస్తుందని ప్రశ్నించారు. ఆమె భూములు ఎలా సంపాదించారని అడిగారు. ప్రియాంకా గాంధీ ఆదాయం ఆమె భర్త ఆదాయం కంటే కూడా ఎక్కువ ఉంది అది ఎలా సాధ్యం అన్నారు. ఢిల్లీ భూముల అవకతవకల విషయంలో ప్రియాంకా హస్తం ఉందని తమకు అనుమానం ఉందని కీలక ఆరోపణలు చేశారు.
కాగా, ఎన్నికల అఫిడవిట్‌లో తనకు మొత్తం రూ.12 కోట్లు విలువైన ఆస్తులు ఉన్నట్లు ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు. అయితే గతేడాది తనకు రూ.46 లక్షల ఆదాయం వచ్చినట్లుగా తెలిపారు. రూ.7.74 కోట్ల విలువైన స్థిరాస్తులు, రూ.4.24 కోట్ల చరాస్తులు, 4.4 కిలోల బంగారం, షిమ్లాలో రూ.5.63 కోట్ల విలువైన బంగ్లా, ఒక కారు, మ్యుచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక తనకు రూ.15.74 లక్షల అప్పులు కూడా ఉన్నట్లు తెలిపారు. తన భర్తకు రూ.27.64 కోట్ల ఆస్తులు ఉన్నట్లు స్పష్టం చేశారు. కాగా, కేరళలోని వయనాడ్ పార్లమెంట్ స్థానానికి జరుగబోయే ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున ప్రియాంకా గాంధీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.