- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ రాజ్యాంగాన్ని మార్చాలని, ప్రజల హక్కులను కాలరాయాలని చూస్తోంది
దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలని, ప్రజల హక్కులను కాలరాయాలని చూస్తోందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. ఆదివారం ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌లో జరిగిన ర్యాలీలో మాట్లాడిన ప్రియాంకా గాంధీ.. బీజేపీ నేతలు ప్రతి చోటా తమకు 400 సీట్లు వస్తాయని అంటున్నారు. అదే జరిగితే రాజ్యాంగాన్ని మార్చేస్తారనే ఆందోళన కలుగుతోంది. భారత అత్యున్నంత రాజ్యాంగం కోసం దేశంలోని చాలామంది గొప్పవారు తమ జీవితాలను అంకితం చేశారు. రాజ్యాంగం మహిళలకు సమానత్వ హక్కు, ఆదీవాసులకు నీటి సౌకర్యం, అటవీ హక్కులను అందించింది. రాజ్యాంగం ఓటు హక్కును, రిజర్వేషన్లను, గిరిజన సంస్కృతికి రక్షణ కల్పించింది. దళితుల అభివృద్ధిని సులభతరం చేసింది. అలాంటి రాజ్యాంగాన్ని కేవలం అధికారం కోసం బీజేపీ పార్టీ మార్చాలని, ప్రజల హక్కులను కాలరాయాలని చూస్తోంది. తద్వారా రిజర్వేషన్లను సైతం నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని చూస్తున్నారు. రాజ్యాంగంలో ఏదైనా మార్పు జరిగితే ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతుందని, ప్రజలు గౌరవప్రదమైన జీవితాన్ని గడపలేరని, వారి హక్కులు, ప్రశ్నించే హక్కును కోల్పోతాయని ఆమె అన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఉద్దేశం సరైనది కాదని ఆరోపించారు. ఇదే సమయంలో 'బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీకి చెందిన కొంతమంది పారిశ్రామికవేత్తల కోసం మాత్రమే పనిచేస్తోంది. అది ప్రజల కోసం పనిచేస్తుంటే సమస్యలు క్రమంగా పరిష్కారమయ్యేవి. మోడీ ప్రభుత్వం 10 ఏళ్లుగా అధికారంలో ఉంది. ప్రజల జీవితం మారిందా?' అని ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు.