- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉత్తరాఖండ్ లో క్లీన్ స్వీప్ దిశగా బీజేపీ
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరాఖండ్ లో బీజేపీ క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తుంది. ఉత్తరాఖండ్ లోని మొత్తం ఐదు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. హరిద్వార్ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన ఉత్తరాఖండ్ మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ ముందంజలో కొనసాగుతున్నారు. మిగితా నాలుగు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులుగా సిట్టింగ్ ఎంపీలే పోటీ చేశారు. గర్వాల్ నియోజకవర్గంలో అనిల్ బలూని ముందంజలో ఉన్నారు. తెహ్రీ గర్వాల్ నియోజకవర్గం నుంచి మాల రాజ్యలక్ష్మీ షా గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. నైనితాల్- ఉధమ్ సింగ్ నగర్ నుంచి నుంచి అజయ్ భట్, అల్మోరా నుంచి అజయ్ టామ్టా విజయానికి చేరువగా ఉన్నారు.
హ్యాట్రిక్ సాధిస్తాం
ఉత్తరాఖండ్ లో మొత్తం ఐదు సీట్లు గెలిచి హ్యాట్రిక్ సాధిస్తామని బీజేపీ స్టేట్ చీఫ్ మహేంద్ర భట్ అన్నారు. అభివృద్ధి పనులు, మోడీకి ఉన్న ప్రజాదరణతో మరోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ లో, దేశంలో ఇండియా కూటమికి అనుకూలంగా ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ స్టేట్ చీఫ్ కరణ్ మహరా అన్నారు. ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.