- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీని విమర్శించే స్థాయి ఏ పార్టీ నాయకుడికి లేదు: DK అరుణ
దిశ, తెలంగాణ బ్యూరో: కర్ణాటక ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలుసుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. ఈ విషయంపై కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఉన్న డీకే అరుణ సోమవారం ప్రకటన విడుదల చేశారు. కర్ణాటక ఎన్నికల్లో భాగంగా గుల్బర్గా జిల్లా చిట్టాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే, మోడీపై నోటికి వచ్చినట్టు వ్యాఖ్యలు చేసినంత మాత్రాన, మోడీకి జరిగే నష్టం ఏమీ లేదని, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలను మెప్పించలేక, ఒప్పించలేక మోడీపై అక్కసును కక్కుతున్నారని, ఇది దేశ ప్రజలంతా గమనిస్తున్నారని డీకే అరుణ అన్నారు. ప్రతిపక్ష నాయకులు ఎంత తనపై నోరు పారేసుకున్నా వాటిని తాను ఆశీర్వాదములా స్వీకరిస్తానని అని మోడీ అనడం అది తనకున్న పెద్ద మనసుకు నిదర్శనమని డీకే అరుణ కొనియాడారు. అసలు నరేంద్ర మోడీని అనే స్థాయి ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకులకు లేదని, ప్రియాంక్ ఖర్గే తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.