- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
షాక్ : రాహుల్‌గాంధీ సభ.. డయాస్‌పై బీజేపీ అభ్యర్థి ఫొటో!
దిశ, నేషనల్ బ్యూరో : అది కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభ. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యే ప్రతిష్ఠాత్మక సభ వేళ షాకింగ్ పరిణామం చోటుచేసుకుంది. ఏకంగా డయాస్‌పై బీజేపీ లోక్‌సభ అభ్యర్థి భారీ ఫొటోను అతికించారు. దీన్ని చూసిన కాంగ్రెస్ నేతలు షాకయ్యారు. వెంటనే దాన్ని తొలగించి.. స్థానిక (కియోలారి) కాంగ్రెస్ ఎమ్మెల్యే రజనీష్ సింగ్ ఫొటోను అతికించారు. ఈ ఘటన సోమవారం ఉదయం మధ్యప్రదేశ్‌లోని మాండ్లా లోక్‌సభ స్థానం పరిధిలో చోటుచేసుకుంది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున ఓంకార్ సింగ్ మార్కం పోటీ చేస్తుండగా.. డయాస్‌పై బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే ఫొటోను అతికించడంతో కలకలం రేగింది. ఈ పరిణామంపై స్పందించిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మీడియా సలహాదారు కేకే మిశ్రా.. మానవ తప్పిదం వల్ల ఇలా జరిగిందన్నారు. దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దని సూచించారు. మాండ్లా లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాండ్లా లోక్‌సభ పరిధిలోని నివాస్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేంద్ర మంత్రి ఫగ్గన్‌సింగ్ కులస్తే ఓడిపోయారు. ఆ సీటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఓంకార్‌సింగ్ మార్కం దాదాపు 9వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచారు. దీంతో ఇక్కడి నుంచి లోక్‌సభకు కూడా తామే గెలుస్తామనే ఆశాభావంతో కాంగ్రెస్ ఉంది.