10వ త‌ర‌గ‌తి బీహార్ టాప‌ర్ ఎంచుకున్న కెరీర్ ఇదే..?! అంద‌రూ షాక్‌!! (వీడియో)

by Sumithra |
10వ త‌ర‌గ‌తి బీహార్ టాప‌ర్ ఎంచుకున్న కెరీర్ ఇదే..?! అంద‌రూ షాక్‌!! (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః మార్చి 31న విడుద‌ల చేసిన బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డ్ (BSEB) 10వ తరగతి బోర్డు ఫలితాల్లో 79.88% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కాగా, ఔరంగాబాద్‌లోని పటేల్ హైస్కూల్ విద్యార్థిని రామాయణి రాయ్ మొత్తం 487 మార్కులు సాధించి, మొదటి స్థానంలో నిలిచింది. అయితే, 10వ తరగతి పరీక్షలో టాపర్‌గా నిలిచిన రామాయణి రాయ్ ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడింది. అగ్ర‌స్థానంలో నిల‌వ‌డం చాలా సంతోషంగా ఉంద‌న్న రామాయ‌ణి, టాప్‌-10 రావాల‌ని అనుకున్నాను కానీ, టాప్ వ‌న్ అవుతాన‌ని అనుకోలేదని చెప్పింది. మ‌రి భ‌విష్య‌త్తులో ఎలాంటి కెరీర్‌ను ఎంచుకోబోతున్నారు అనే ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌రంగా స్పందించింది. సాధార‌ణంగా టాప్‌లో వ‌చ్చినోళ్లు సివిల్స్‌లోనో, రాజ‌కీయాల్లోనో, టాప్ సైన్స్‌లోనో అగ్ర‌స్థానాల‌ను కోరుకుంటారు. అయితే, రామాయ‌ణి మాత్రం అందుకు భిన్నంగా భవిష్యత్తులో జర్నలిజంలో మరింత ముందుకు వెళ్లాలనుకుంటున్నానంటూ స‌మాధాన‌మిచ్చింది. అలాగే, తల్లిదండ్రులు త‌మ‌ పిల్లల్ని నమ్మండం చాలా అవ‌స‌రమ‌ని, త‌న‌ తల్లిదండ్రులు అలాంటి న‌మ్మ‌కం నాపైన ఉంచ‌బ‌ట్టే తాను టాప‌ర్ అయ్యాన‌ని పేర్కొంది. యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ స‌బ్జెక్ట్‌లో తనకున్న‌ సందేహాలను నివృత్తి చేసుకునేదానినని తెలిపింది. తాను రోజుకు మూడు నుంచి నాలుగు గంటలు చదువుకునేదాన్న‌నీ చెప్పింది.

ఇక‌, బీహార్ ప‌దో త‌ర‌గ‌తి ఫలితాల్లో 12,86,971 మంది విద్యార్థులు ఉత్తీర్ణులవ‌గా నవాడా జిల్లాకు చెందిన సానియా, మధుబనికి చెందిన వివేక్‌ రెండో టాపర్‌లుగా నిలిచారు. ఇద్దరికీ 486 మార్కులు వచ్చాయి. ప్రజ్ఞా కుమారికి 485 మార్కులు సాధించి, మూడవ స్థానంలో నిలిచింది.

Advertisement

Next Story

Most Viewed