బిగ్ బ్రేకింగ్: ప్రధాని మోడీకి మాతృవియోగం

by Sathputhe Rajesh |   ( Updated:2023-01-21 14:42:11.0  )
బిగ్ బ్రేకింగ్: ప్రధాని మోడీకి మాతృవియోగం
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీకి మాతృవియోగం కలిగింది. తల్లి హీరా బెన్(100) కన్నుమూశారు. రెండు రోజుల క్రితం అనారోగ్యం కారణంగా హీరాబెన్ అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతున్న హీరాబెన్ ఆరోగ్యం విషమించడంతో గురువారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు. ఇటీవలే వందో పుట్టిన రోజు వేడుకలను హీరాబెన్ జరుపుకున్నారు. కాగా తల్లి మరణంపై మోడీ భావోద్వేగ ట్వీట్ చేశారు. నిండు నూరేళ్లు పూర్తి చేసుకుని తన తల్లి ఈశ్వరుడి చెంతకు చేరిందన్నారు. ఆమె జీవితం ఒక తపస్సులాంటిదన్నారు. అమ్మ నిస్వార్థానికి చిహ్నమన్నారు. అమ్మలో త్రిమూర్తులను చూశానన్నారు. తన తల్లి కర్మయోగికి ప్రతీకలా నిలిచిందన్నారు. తల్లి మరణ వార్త తెలుసుకుని అహ్మదాబాద్‌కు మోడీ బయలుదేరారు. గాంధీ నగర్‌లో హీరాబెన్ అంత్యక్రియలు చేయనున్నారు.

Also Read...

హీరాబెన్ మృతికి ప్రముఖుల సంతాపం

Advertisement

Next Story