- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను తప్పుదోవ పట్టించొద్దు'
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కేంద్రంపై తీవ్రంగా మండిపడ్డారు.రాజకీయ ప్రయోజనాల కోసం భారతదేశం గొప్ప స్వాతంత్ర్య సమరయోధుల సహకారాన్ని తగ్గించే ప్రయత్నం ఆమోదయోగ్యం కాదని అన్నారు. సోమవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా సందేశంతో కూడిన లేఖను ఆమె షేర్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం చారిత్రక వాస్తవాలను తప్పుదోవ పట్టించడాన్ని కాంగ్రెస్ అంగీకరించదని అన్నారు. అంతేకాకుండా గాంధీ-నెహ్రూ-పటేల్-ఆజాద్‌లను తక్కువచేసి చూపడాన్ని కూడా అనుమతించబోదని చెప్పారు.
కాగా, అంతకుముందు రోజు కర్ణాటక బీజేపీ ప్రభుత్వం స్వాతంత్ర్య పోరాట యోధుల ప్రకటనలో నెహ్రును చేర్చలేదు. దీంతో ఆగస్టు 14ను విభజన భయానక దినోత్సవంగా పేర్కొంటూ, నెహ్రూను నిందించేలా ఉన్న వీడియోను బీజేపీ షేర్ చేసింది. దీనిని ఉద్దేశించి గత 75 ఏళ్లలో మనం చాలా సాధించామని అన్నారు. అనేక రంగాల్లో పురోగతి దిశగా వెళ్తున్నామని చెప్పారు. దూరదృష్టి గల నాయకుల నాయకత్వంలో స్వేచ్ఛ, న్యాయమైన, పారదర్శక ఎన్నికల వ్యవస్థను ఏర్పాటుచేసుకున్నామని అన్నారు. నేటి నార్సిసిస్టిక్ ప్రభుత్వం మన స్వాతంత్ర్య సమరయోధుల గొప్ప త్యాగాలను, దేశ అద్భుతమైన విజయాలను తగ్గించడంలో బిజీగా ఉందని విమర్శించారు. కరోనా కారణంగా ఆమె స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనలేదు.