ఫిబ్రవరి 16న భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన రైతు సంఘాలు

by S Gopi |
ఫిబ్రవరి 16న భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన రైతు సంఘాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా రైతు సంఘాలు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ దేశ రాజధాని ఢిల్లీలో నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. దీనికి మద్దతివ్వాలని 200 రైతు సంఘాలకు పిలుపు కూడా ఇచ్చాయి. ఇప్పటికే పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు భారీ సంఖ్యలో రైతులు పార్లమెంట్ ముట్టడికి బయలుదేరగా, వారిని అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 16న(శుక్రవారం) భారత్ బంద్‌కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలో ఉన్న హర్యానా, పంజాబ్ రైతులు కేంద్రం తీరుకు నిరసనగా బంద్‌లో పాల్గొనాలని దేశవ్యాప్తంగా ఉన్న రైతులను కోరారు. భారత్ బంద్‌లో భాగంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్ పాటించాలని, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశవ్యాప్తంగా ప్రధాన రహదారులపై రైతులు పెద్దఎత్తున నిరసన తెలపనున్నట్టు వెల్లడించారు. పంజాబ్‌లో నిరసన సందర్భంగా రాష్ట్ర, జాతీయ రహదారులలో గణనీయమైన భాగాన్ని నాలుగు గంటల పాటు మూసివేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed