బెలూన్స్ అమ్ముకునే అమ్మాయి రాత్రికి రాత్రే సూప‌ర్ ఫేమ‌స్‌... ఎలా?!

by Sumithra |   ( Updated:2023-06-16 09:45:29.0  )
బెలూన్స్ అమ్ముకునే అమ్మాయి రాత్రికి రాత్రే సూప‌ర్ ఫేమ‌స్‌... ఎలా?!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ఇంటర్నెట్ యుగంలో మ‌నిషి జీవితంలో వ‌చ్చిన అనుహ్య‌మైన మార్పు ఒక అద్భుతం. దానికితోడు సోష‌ల్ మీడియా ప్ర‌పంచ‌పు చిత్రాన్ని స‌మూలంగా మార్చింది. ఒక్క పోస్ట్ రాత్రికి రాత్రే ఎవరినైనా సంచలనంగా మార్చ‌గ‌ల‌దు. ఇటీవ‌ల కాలంలో రోను మొండల్, `బచ్‌పన్ కా ప్యార్ బాయ్` సహదేవ్ దిర్డో, తాజాగా `కచా బాదం` గాయకుడు భుబన్ బద్యాకర్... ఇలాంటి వ్యక్తులంతా ప్ర‌పంచానికి ప‌రిచ‌యం కావ‌డానికి కార‌ణం ఇదే. మ‌ట్టిలో మాణిక్యాలెన్నో ఇప్పుడు ఇంట‌ర్నెట్‌లోనే దొరుకుతాయి. ఈ లిస్ట్‌లోకి తాజాగా వ్య‌క్తి చేరింది. కేరళలో రద్దీగా ఉండే ప్రదేశాల్లో బెలూన్లు అమ్మే ఒక అమ్మాయి. శ్రామికుల్లో అందాన్ని ఆరాధించిన‌ ఓ క‌విలా కేర‌ళాకు చెందిన ఒక‌ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పెళ్లి ఫోటోషూట్ కోసం మోడల్‌గా ఈ అమ్మాయినే ఎన్నుకున్నాడు. నెట్‌లో త‌న వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేయ‌గానే ఇప్పుడామె ఇంట‌ర్నెట్‌లో ఓవ‌ర్ నైట్ స్టార్ అయ్యింది.

అర్జున్ కృష్ణన్ అనే ఫోటోగ్రాఫర్ కేరళలోని అండలూర్ కావు ఉత్సవంలో ఈ అమ్మాయిని గుర్తించాడు. కిస్బు అనే ఈ అమ్మాయి రాజస్థానీ కుటుంబానికి చెందిన యువ‌తి. కేరళలో బెలూన్ విక్ర‌యిస్తూ ఉంటుంది. ఇక‌, అర్జున్ సోషల్ మీడియాలో తాను క్లిక్ చేసిన ఫోటోల‌ను షేర్ చేయ‌గానే సూప‌ర్‌ స్పందన వ‌చ్చింది. అతని స్నేహితుడు శ్రేయాస్ కూడా కిస్బుని కెమెరాలో బంధించాడు. ఇవి, త‌క్కువ స‌మ‌యంలోనే వైర‌ల్‌గా మారాయి. కిస్బుని ఫోటోషూట్ కోసం మోడ‌ల్‌గా మార్చ‌డానికి ఆమె కుటుంబంతో ముందుగానే సంప్రదించారు. రమ్య అనే స్టైలిస్ట్ సహాయంతో కిస్బు ఇప్పుడు `కిరాక్‌`గా కనిపించింది.

Advertisement

Next Story

Most Viewed