రూ.5 లక్షల వరకు ఫ్రీ ఇన్స్యూరెన్స్.. సీనియర్ సిటిజన్లకు కేంద్రం బంపర్ ఆఫర్..

by karthikeya |   ( Updated:2024-09-11 15:13:18.0  )
రూ.5 లక్షల వరకు ఫ్రీ ఇన్స్యూరెన్స్.. సీనియర్ సిటిజన్లకు కేంద్రం బంపర్ ఆఫర్..
X

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వం (Central Government) బంపర్ ఆఫర్ ప్రకటించింది. 70 ఏళ్లు పైబడిన వారికి ఆయుష్మాన్ భారత్ (Ayushman Bharat) అమలు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు బుధవారం నిర్వహించిన కేబినెట్ మీటింగ్‌ (Cabinet Meeting)లో కీలక తీర్మానం చేసినట్లు వెల్లడించింది. ఇక ఈ నిర్ణయం ద్వారా దేశంలోని కనీసం 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్ల (Senior Citizens)కు లబ్ధి చేకూరే అవకాశం ఉందని, ఒక్కొక్కరికీ రూ.5 లక్షల విలువైన ఆరోగ్య బీమా సౌకర్యం లభిస్తుందని అంచనా వేస్తున్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ (Aswini Vaishnav) మాట్లాడుతూ.. ఆయుష్మాన్ భారత్ పీఎం జన ఆరోగ్య యోజన ద్వారా 70 ఏళ్ల పైబడిన వారందరికీ ఉచితంగా వైద్యం అందించాలని కేంద్రం నిర్ణయించిందని చెప్పారు. పేద, మధ్యతరగతి, ధనికులు అనే బేధం లేకుండా అందరికీ ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. మానవతా దృక్పథంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. దీనివల్ల 4.5 కోట్ల కుటుంబాలకు, అందులోనూ 6 కోట్ల మంది వృద్ధులకు లబ్ధి చేకూరబోతోందని ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story