- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అల్లు అర్జున్ కేసులో కీలక పరిణామం.. తెలంగాణ డీజీపీకి NHRC నోటీసులు
దిశ, వెబ్ డెస్క్: నటుడు అల్లు అర్జున్ కేసు(Actor Allu Arjun)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ‘పుష్పా-2’ సినిమా(Pushpa-2 movie) విడుదల నేపథ్యంలో సంధ్యా థియేటర్ వద్ద ప్రేక్షకులపై లాఠీఛార్జి జరిగింది. అయితే ఈ లాఠీఛార్జి వల్లే తొక్కిసలాట జరిగిందని, రేవతి అనే మహిళ మృతి చెందారని, అలాగే మరో ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారని లాయర్ రామారావు ఎన్‌హెచ్‌ఆర్సీలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను తాజాగా NHRC స్వీకరించింది. దీంతో తెలంగాణ డీజీపీతోపాటు హైదరాబాద్ సీపీకి నోటీసులు జారీ చేసింది. సంథ్య థియేటర్ వద్ద జరిగిన లాఠీఛార్జి ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని సూచించింది.
కాగా పుష్పా-2 విడుదల సందర్భంగా హైదరాబాద్ సంథ్య థియేటర్(Hyderabad Santhya Theatre) వద్ద తొక్కిసలాట జరిగింది. అయితే ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నటుడు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం రేపింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి కూడా కారణమైంది.
Read More : Allu Aravind: అల్లు అరవింద్ కు నలుగురు కొడుకులు ఉన్నారా.. నాలుగో కొడుకు ఎక్కడ?