- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
న్యూ ఇయర్ లో తాగుడే తాగుడు
దిశ, ఖమ్మం : సందర్భం ఏదైనా సరే మందుబాబులకు కిక్కు ఉండాల్సిందే. అదే డిసెంబర్ 31 అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఆ రోజు ఎలాగైనా మందు తాగాల్సిందేనని కంకణం కట్టుకుంటారు. రోజు వారీ తాగేదానికంటే ఆ రోజు రెట్టింపు సీసాలు ఖాళీ చేసేస్తారు. జిల్లాలో డిసెంబర్ 30,31 సందర్భంగా ఇదే జరిగింది. జిల్లా వ్యాప్తంగా మందుబాబులు తెగ రెచ్చిపోయి తాగేశారు. ప్రభుత్వం కూడా అర్ధరాత్రి వరకు విక్రయాలు చేయడంతో ఉదయం నుంచి అర్ధ రాత్రి వరకు మద్యం షాపులు, బార్లు, బెల్టు షాపుల వద్ద సందడి చేస్తూనే ఉన్నారు.
ఫలితంగా మద్యం విక్రయాలు ఈ ఒక్క రోజులో కోట్లల్లోనే జరిగాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 208 మద్యం దుకాణాల్లో ఒక్క రోజు అమ్మకాలు రూ.42 కోట్లు నమోదయ్యాయి. ఇందులో ఒక్క బీర్లే 11924 సీసాలు ఖాళీ చేసేశారు. బ్రాందీ, విస్కీ, ఇతర మద్యం బాటిళ్లకు సంబంధించి 29979 ఐఎంఎల్ కేసులు అమ్ముడుపోయాయని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. రాత్రి వరకు వైన్స్ పావులు, బార్ అండ్ రెస్టారెంట్లలో ఆర్థ రాత్రి వరకు అమ్మకాలు జరిగాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రూ. 42 కోట్ల అమ్మకాలు..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మందుబాబులు రెచ్చిపోయారు. కొత్త సంవత్సరం పేరుతో డిసెంబరు 30, 31 రాత్రి రెండు రోజుల్లో తెగ తాగేశారు. వేలాది బీర్లు, వందలాది మద్యం బాటిళ్లు లేపేశారు. నాన్ స్టాప్‌గా పీల్చి పడేశారు. దీంతో ఈ ఒక్కరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మద్యం విక్రయాలు ఏకంగా రూ. 42 కోట్లు జరిగాయి. ఒకరకంగా ఇది రికార్డే. సాధారణ రోజుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోజుకు రూ.5 కోట్ల వరకు మద్యం అమ్ముడవుతుంది. కానీ డిసెంబర్ 31 రాత్రి మాత్రం మూడింతలు పైగా విక్రయాలు జరిగాయి. దీంతో ఎక్సైజ్ శాఖ ఖజానాకు కాసుల వర్షం కురిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్సైజ్ 13 సర్కిళ్ల పరిధిలో డిసెంబర్ 30వ తేదీల్లో వైన్ షాపులలో విపరీతంగా అమ్మకాలు జరిగాయి.
అశ్వారావుపేట సర్కిల్ లో రూ. 1.63 కోట్లు, భద్రాచలం సర్కిల్లో రూ. 2.54, ఖమ్మం (1) సర్కిల్ రూ. 4.69, కొత్తగూడెం సర్కిల్ రూ. 1.95, మధిర సర్కిల్ రూ. 1.75, మణుగూరు సర్కిల్ రూ.1.50, నెలకొండపల్లి సర్కిల్ రూ. 1.64, పాల్వంచ సర్కిల్ రూ. 81.92 లక్షలు, సత్తుపల్లి సర్కిల్ రూ. 1.40 కోట్లు, సింగరేణి సర్కిల్ రూ. 91 లక్షలు, వైరా సర్కిల్, రూ. 1.38 కోట్లు, ఇల్లందు సర్కిల్ రూ. 1.44 కోట్లు, ఖమ్మం (2) సర్కిల్ రూ. 2.24 కోట్ల మొత్తం రూ. 25 కోట్లమద్యం అమ్మకాలు జోరుగా జరిగాయి. దాంతో పాటు డిసెంబర్ 31వ తేదీన 13 ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని రూ. 17 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. రెండు రోజులపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రూ. 42 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ అధికారుల ద్వారా తెలుస్తుంది. ఇంత పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలు జరిగాయని దాని దృష్టిలో పెట్టుకొని మరికొద్ది రోజుల్లో సంక్రాంతి రాబోతోంది. ఈ నేపథ్యంలో విక్రయాలు పెంచుకోవడం కోసం అప్పుడే ప్రభుత్వం భారీ ఎత్తున మందు సిద్ధం చేస్తోంది. రకరకాల బ్రాండ్లను సైతం కొత్తగా దించబోతోందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.