NEET UG ROW: సైబర్ సెక్యూరిటీ లోపాలు దిద్దేందుకు సాంకేతికతను తీసుకురావాలి

by Shamantha N |
NEET UG ROW: సైబర్ సెక్యూరిటీ లోపాలు దిద్దేందుకు సాంకేతికతను తీసుకురావాలి
X

దిశ, నేషనల్ బ్యూరో: నీట్‌ యూజీ పరీక్ష (NEET UG) పేపర్ లీకేజీలపై కేంద్రం కీలక ప్రకటనలు చేసింది. ఎగ్జామ్ వ్య‌వ‌స్థ‌లో ఉన్న సైబ‌ర్ సెక్యూర్టీ లోపాల‌ను స‌రిదిద్దేందుకు వీలైన సాంకేతికత‌కు తీసుకురావాల‌ని ఎన్టీఏను ఆదేశించింది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ లోపాలను ధర్మాసనం ఎత్తిచూపింది. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే లోపాలను సరిదిద్దుకోవాలని సూచించింది. నీట్ పరీక్ష రద్దు చేయవద్దని ఇటీవలే జస్టిస్ సీజేఐ ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. అయితే, అందుకు గల కారణాలు వివరిస్తూ సీజేఐ బెంచ్ శుక్రవారం మరో తీర్పు వెలువరించింది. నీట్‌ పేపర్‌ లీకేజీ లో ఎలాంటి వ్యవస్థీకృత ఉల్లంఘనలు చోటుచేసుకోలేదంది. విస్తృత స్థాయిలో లీకేజీలు జరగలేదంది. పేపర్ లీకేజీ జార్ఖండ్‌లోని హజారీబాగ్‌, బిహార్‌లోని పాట్నా వరకే పరిమితమైందని పేర్కొంది. దానిపైన దర్యాప్తు జరుగుతోందని వెల్లడించింది.

కమిటీకి కీలక ఆదేశాలు

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని సుప్రీంకోర్టు వెల్లడించింద. విద్యార్థుల భవిష్యత్ కు సంబంధించిన ఈ విషయంలో ఇలాంటి ఘటనలు జరగడం మంచిది కాదంది. ఈ సమస్యలను త్వరగా పరిష్కరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. భవిష్యత్ లో ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎన్టీయేదే అని సీజేఐ ధర్మాసనం పేర్కొంది. అయితే, ఎన్టీఏలోని సంస్కరణల కోసం ఇటీవలే ఇస్రో మాజీ చీఫ్ కె. రాధాకృష్ణన్ నేతృత్వంలో కేంద్రం కమిటీ ఏర్పాటు చేసింది. అయితే, కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీ ప్యానెల్‌ను మరింత విస్తరించాలని పేర్కొంది. పరీక్షా విధానంలో లోపాలు సరిదిద్దేందుకు అవసరమైన చర్యల గురించి సెప్టెంబర్ 30లోగా నివేదిక అందజేయాలంది. ఈ నివేదిక అందిన తర్వాత అందులోని అంశాలను అమలుచేసే అంశంపై రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది.

Advertisement

Next Story