- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉపా చట్టం కింద అరుంధతీ రాయ్ ని విచారించనున్న పోలీసులు
దిశ, నేషనల్ బ్యూరో: రచయిత్రి, సామాజిక కార్యకర్త అరుంధతీ రాయ్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆమెను ఉపా చట్టం కింద విచారించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతి ఇచ్చారు. ఆ కేసులోనే కశ్మీర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ షేక్ షౌకత్ హుస్సేన్ ప్రాసిక్యూషన్ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2010లో ఢిల్లీలో జరిగిన ఓ సెమినార్‌లో వీరిద్దరూ భారత్‌కు వ్యతిరేకంగా, ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారని ‘రూట్స్ ఇన్ కశ్మీర్’ అనే కశ్మీరీ పండిట్ల సంస్థకు చెందిన సుశీల్ పండిట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా, శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొన్నారు. వీరిపైన దర్యాప్తు ప్రారంభించేలా పోలీసులను ఆదేశించాలని న్యూఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ను సుశీల్ పండిట్ ఆశ్రయించారు. దీంతో, నవంబర్ 2010లో అరుంధతీ రాయ్, షేక్ షౌకత్ హుస్సేన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. తాజాగా.. వీరిద్దరిని ఉపా చట్టం కింద విచారించాల్సిందిగా పోలీసులకు గవర్నర్ అనుమతి ఇచ్చారు.