Savarkar :స్కూళ్లలో సావర్కర్ జయంతి, ఆర్టికల్ 370 రద్దు ఉత్సవాలు

by Hajipasha |   ( Updated:2024-07-29 12:59:58.0  )
Savarkar :స్కూళ్లలో సావర్కర్ జయంతి, ఆర్టికల్ 370 రద్దు ఉత్సవాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : రాజస్థాన్ మాధ్యమిక పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక నుంచి ఏటా మే 28న సావర్కర్ జయంతి, మే 29న మహారాణా ప్రతాప్ (16వ శతాబ్దపు మేవార్ పాలకుడు) జయంతి ప్రభుత్వ స్కూళ్లలో నిర్వహిస్తామని ప్రకటించింది. అయోధ్య రామాలయం ప్రారంభమైన తేదీన (జనవరి 22) కూడా పాఠశాలల్లో సెలబ్రేషన్స్ నిర్వహిస్తామని వెల్లడించింది. ఈమేరకు మార్పులతో మాధ్యమిక పాఠశాలల వార్షిక క్యాలెండర్‌ను రాజస్థాన్ సర్కారు ఆవిష్కరించింది.

జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసిన రోజును (ఆగస్టు 5) "స్వర్ణముకుట్ దివస్"గా నిర్వహిస్తామని క్యాలెండర్‌లో ప్రస్తావించారు. మదన్ దిలావర్ ఈ ఏడాది ఫిబ్రవరి 26న రాజస్థాన్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈమేరకు పాఠశాలల వార్షిక క్యాలెండర్‌లో మార్పులు చేస్తామని అప్పటి నుంచే ఆయన చెబుతూ వస్తున్నారు. ‘‘మొఘల్ చక్రవర్తి అక్బర్‌ ఒక రేపిస్ట్’’ అని అప్పట్లో మదన్ దిలావర్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.

Advertisement

Next Story