- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భారత్‌కు సంజయ్ భండారీ అప్పగింత.. లండన్‌లో కీలక పరిణామం
దిశ, నేషనల్ బ్యూరో : భారత్ నుంచి పరారై బ్రిటన్‌లో తలదాచుకుంటున్న ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీ భారత దర్యాప్తు సంస్థల వాంటెడ్ లిస్టులో ఉన్నాడు. అతడిని భారత్‌కు అప్పగించే దిశగా అడుగులు పడుతున్న తరుణంలో గురువారం కీలక అవరోధం ఏర్పడింది. తనను భారత్‌కు అప్పగించాలని 2022 నవంబరులో వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ సంజయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను లండన్‌లోని హైకోర్టు సమర్ధించింది. ఆ ఆదేశాలపై అప్పీల్ చేసుకునేందుకు సంజయ్ భండారీకి అనుమతిని మంజూరు చేసింది. దీంతో మొత్తం వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. 2022 నవంబరులో వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన సంజయ్ భండారీ అప్పగింత ఆదేశాల ఆధారంగా.. గతేడాది అప్పటి బ్రిటన్ విదేశాంగ మంత్రి సుయెల్లా బ్రేవర్‌మన్ కీలక ప్రకటన చేశారు. సంజయ్ భండారీని భారత్‌కు అప్పగించేందుకు ఉత్తర్వులు జారీ చేయడం అప్పట్లో సంచలనం క్రియేట్ చేసింది. సంజయ్ భండారీపై ఈడీలో కొనసాగుతున్న కేసులో ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పేరును కూడా ప్రస్తావించారు. రాబర్ట్ వాద్రాతో పాటు సంజయ్ భండారీ సన్నిహితులు సీసీ తంపి, సుమిత్ చద్దాలపై ఢిల్లీ కోర్టులో ఈడీ గతేడాది డిసెంబరులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సీసీ థంపి యూఏఈ ఎన్ఆర్ఐ, సుమిత్ చద్దా లండన్ పౌరుడు. ఈ కేసులో ఇద్దరిని ఇప్పటికే అరెస్టు చేశారు. నిందితులు సీసీ థంపీ, రాబర్ట్ వాద్రాల మధ్య డబ్బు లావాదేవీలే కాకుండా లండన్‌లో ఉన్న 12 బ్రయాన్‌స్టన్ స్క్వేర్ ఫ్లాట్‌ను రాబర్ట్ వాద్రా కోరిక మేరకు సీసీ థంపి రిపేర్ చేయించారని కోర్టుకు ఈడీ తెలిపింది.