వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా పేరెంట్స్ పై కేసు నమోదు

by Shamantha N |
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా పేరెంట్స్ పై కేసు నమోదు
X

దిశ, నేషనల్ బ్యూరో: వరుస వివాదాల్లో చిక్కుకున్న ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్ కర్ తల్లిదండ్రులపై కేసునమోదైంది. రైతులను గన్ తో బెదిరించిన ఘటనలో ఐఏఎస్ తల్లి మనోరమపై పోలీసులు కేసు నమోదైంది. మనోరమాతో పాటు ఆమె భర్త దిలీప్ ఖేడ్ కర్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహితలోని 323, 504, 506, 143, 144, 147, 148, 149 సెక్షన్ల కింద, ఆయుధ చట్టం కింద కేసు పెట్టారు. కొంత మంది రైతుల్ని గ‌న్‌తో బెద‌రిస్తున్న‌ట్లు మ‌నోర‌మ ఖేడ్ కర్ చెందిన వీడియో వైర‌ల్ అయ్యింది. ఆ వీడియో ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మ‌నోర‌మ దగ్గరున్న గ‌న్‌కు లైసెన్సు ఉందా లేదా అన్న కోణంలో విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు పేర్కొన్నారు.

రైతుని బెదిరించిన పూజా తల్లి

ట్రైనీ ఐఏఎస్ ఆఫీస‌ర్ పూజా ఖేద్క‌ర్ తండ్రి దిలీప్ ఖేద్క‌ర్ ప్ర‌భుత్వ ఆఫీస‌ర్‌గా చేశారు. అయితే పుణె త‌హిసిల్‌లోని ధాడ్‌వాలీ గ్రామంలో ఆయ‌న భూమిని కొన్నారు. అయితే ప‌క్క‌న ఉన్న భూమిని కూడా ఆ కుటుంబం క‌బ్జా చేసింద‌ని రైతులు ఆరోపిస్తున్నారు. కొనుగోలు చేసిన భూమి వ‌ద్ద .. ప‌క్క‌వారితో మ‌నోరమా ఖేద్క‌ర్ గొడ‌వ‌కు దిగారు. సెక్యూర్టీ గార్డుల‌తో అక్క‌డ‌కు ఆమె వెళ్లారు. ఆ బెదిరింపు ఘ‌ట‌న‌కు చెందిన రెండు నిమిషాల వీడియో వైర‌ల్ అయ్యింది. త‌న పిస్తోల్ ప‌ట్టుకున్న మ‌నోర‌మ రైతుల‌పై అరుస్తూ క‌నిపించింది. మ‌నోర‌మ‌ త‌న భూమిని అక్ర‌మంగా లాగేసుకుంటోంద‌ని కుల్దీప్ ప‌స‌ల్క‌ర్ అనే రైతు పేర్కొన్నాడు. 2023 బ్యాచ్ కు చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా త‌న సొంత ఆడీ కారుకు బీక‌న్ పెట్టుకుని తిరుగుతోంది. అనేక సార్లు ఆమె సిగ్న‌ల్ జంప్ చేసింది. పుణె ట్రాఫిక్ పోలీసులు ఆమెకు 27 వేల జ‌రిమానా వేశారు. ఐఏఎస్ కోసం ఓబీసీ సహా దివ్యాంగుల రాయితీ పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో, పూజా ప్రవర్తన, ఎంపిక ప్రక్రియపై విచారణ చేపట్టిన కేంద్రం.. ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.

Advertisement

Next Story

Most Viewed