ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం

by M.Rajitha |
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఎక్సైజ్ పాలసీలో మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని ఈడీ అరెస్టు చేయగా.. సుప్రీం కోర్టులో తాత్కాలిక బెయిల్ తెచ్చుకున్నారు కేజ్రీవాల్. బెయిల్ పై బయటికి రాకముందే మళ్ళీ సీబీఐ అరెస్టు చేసింది. సీబీఐ అరెస్టును రద్దు చేయాలని ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేయగా న్యాయస్థానం సీబీఐ వాదనలతో ఏకీభవించి, కేజ్రీవాల్ పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో ఇపుడు సుప్రీం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. అలాగే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసినట్టు సమాచారం. ఇదే కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా 17 నెలల జైలు శిక్ష అనుభవించి, ఇటీవలే బెయిల్ పై బయటకి వచ్చారు. కాగా లిక్కర్ స్కామ్ లో అరెస్టైన ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత ఇంకా జైళ్లోనే ఉన్నారు. ఆమె బెయిల్ పిటిషన్ విచారణ కొనసాగుతోంది.

Next Story

Most Viewed