wolf attack: ఉత్తరప్రదేశ్ లో మరోసారి తోడేలు దాడి

by Shamantha N |
wolf attack: ఉత్తరప్రదేశ్ లో మరోసారి తోడేలు దాడి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌లో(Bahraich) మరోసారి తోడేలు దాడి(wolf attack) జరిగింది. గురువారం రాత్రి పదేళ్ల బాలుడిపై తోడేలు దాడి చేసింది. కొత్వాలీ(Kotwali) ప్రాంతంలో ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై తోడేలు దాడి చేసింది. ఈ దాడిలో బాలుడి ముఖంపై గాయాలయ్యాయి. మరోవైపు, తోడేళ్ల వరుస దాడులతో జనం భయాందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న తోడేళ్ల దాడుల్లో పది మంది మృతి చెందగా, 35 మందికి పైగా గాయపడ్డారు. తోడేళ్ల దాడులను ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం విపత్తుగా ప్రకటించింది. తోడేళ్లు కనిపిస్తే కాల్చేయడానికి షూటర్లను రంగంలోకి దింపింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(UP Chief Minister Yogi Adityanath) ఆదేశాల మేరకు ప్రజలపై దాడి చేస్తున్న తోడేళ్లను కాల్చేందుకు తొమ్మిది మంది షూటర్ల బృందం బహ్రెయిచ్ అడవుల్లో మోహరించింది. అయితే, తోడేళ్ల పిల్లలపై దాడి చేసినప్పుడు, అవి ఏర్పరుచుకున్న ఆశ్రయాలను ధ్వంసం చేసినపుడు మాత్రమే అవి ప్రతీకార దాడులకు దిగుతాయని నిపుణులు చెబుతున్నారు. బహ్రెయిచ్‌లో తోడేళ్లు మనుషులపై వరుస దాడులకు దిగడానికి ఇదే కారణమయి ఉండొచ్చని వారు అనుమానిస్తున్నారు. సాధారణ పరిస్థితుల్లో అయితే తోడేళ్లది దాడికి పాల్పడే స్వభావం కాదని నిపుణులు చెబుతుండడం గమనార్హం.

Advertisement

Next Story