ఆ స్టార్ హీరోతో పెళ్లి.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన టాలీవుడ్ హీరోయిన్

by Kavitha |   ( Updated:2024-10-25 15:14:37.0  )
ఆ స్టార్ హీరోతో పెళ్లి.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన టాలీవుడ్ హీరోయిన్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ నిత్యామీనన్(Nithya menon) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) హీరోగా నటించిన ‘అలా మొదలైంది’(Ala Modalaindhi) మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. తన ఫస్ట్ సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసి ఆకట్టుకుంది. అలాగే తన అందం అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది.

ప్రస్తుతం ఈ అమ్మడు.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేసి మెప్పిస్తోంది. అంతే కాదు ఈ బ్యూటీ సింగర్(Singer) గాను తన ప్రతిభ చాటుకుంది. సినిమాల్లో కొన్ని పాటలను కూడా ఆలపించింది ఈ అమ్మడు. ఇక నిత్యామీనన్ తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ భాషల్లోనూ నటిస్తూ మెప్పిస్తోంది. కాగా తెలుగులో చివరిగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటించిన ‘భీమ్లా నాయక్’(Bheemla Nayak) సినిమాలో మెరిసింది. అయితే ధనుష్‌తో కలిసి ఆమె నటించిన ‘తిరు’(thiru) సినిమాకు గాను ఉత్తమ నటిగా నిత్యా జాతీయ అవార్డు అందుకుంది.

ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజులుగా ఈ భామ ఓ మలయాళ స్టార్ హీరోను పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు నెట్టింట హల్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై నిత్యా మీనన్ క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్య.. తన మ్యారేజ్ ‌పై వస్తున్న రూమర్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. “నా వ్యక్తిగత విషయం నా వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితంపై ఎవరూ కూడా నాపై ఆధిపత్యం చేయడం నాకు నచ్చదు. నాకు నచ్చినట్టు నేను బతుకుతాను. నేను పెళ్లి ఎందుకు చేసుకోవడం లేదని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. ఆ విషయంలో నన్ను ప్రశ్నిస్తే నేను ఒప్పుకోను.

అలాగే నాపై వచ్చే రూమర్లు, గాసిప్స్‌ను పట్టించుకోను. ఇటీవల నేను మలయాళ హీరోను పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అదంతా ఫేక్ న్యూస్, అలాంటి వాటిని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు. నేను పెళ్లి ఎవరిని చేసుకోవాలి? ఎప్పుడు చేసుకోవాలనేది నా ఇష్టం. అంతేగాని ఎవరో రాస్తే నేను చేసుకుంటానా?. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా తల్లిదండ్రులు నాకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చారు. ఆ స్వేచ్ఛను ఎప్పుడూ దుర్వినియోగం చేసుకోలేదు. ఏ విషయంలోనైనా నన్ను నా పేరెంట్స్ పూర్తిగా స్వేచ్చనిస్తారు. వారి నమ్మకాన్ని నేను ఎప్పుడూ దెబ్బ తీయను. నా పరిధిలో నేను జీవితాన్ని ఆస్వాదిస్తుంటాను” అని నిత్య మీనన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story