భితార్కానికా, ధమ్రాల మధ్య తీరం దాటిన దానా తీవ్ర తుఫాన్

by Mahesh |   ( Updated:2024-10-25 02:06:59.0  )
భితార్కానికా, ధమ్రాల మధ్య తీరం దాటిన దానా తీవ్ర తుఫాన్
X

దిశ, వెబ్‌డెస్క్: వాయువ్య బంగాళాఖాతం(Northwest Bay of Bengal)లో ఎర్పడిన దానా తుఫాన్‌(Dana Typhoon) ఉత్తర వాయువ్య దిశగా పయనించి శుక్రవారం తెల్లవారుజామున తీరం దాటింది. ఒడిశాలోని భితార్కానికా, ధమ్రా ప్రాంతాల మధ్య అర్ధరాత్రి 1.30 నుంచి 3.30 గంటల మధ్య తీరం దాటినట్లు వాతావరణ శాఖ(Department of Meteorology) పేర్కొంది. ఈ భీకరమైన దానా తుఫాన్ తీరాన్ని తాకే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో భారీ గాలులు వీచాయని దీంతో సముద్రం అల్లకల్లోలం అయినట్లు తెలిపారు. అలాగే దానా తుఫాన్ తీరం దాటినప్పటకికి దాని ప్రభావంతో తీరప్రాంత జిల్లాలైన భద్రక్‌, జగత్సింగ్‌పూర్, బాలాసోర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో నేడు ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Advertisement

Next Story

Most Viewed