- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు: మనీష్ సిసోడియాకు మరోసారి ఎదురుదెబ్బ..
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ జిల్లా కోర్టులో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన మనీలాండరింగ్ కేసులో బెయిల్ కోసం ఆయన చేసిన దరఖాస్తును కోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. సిసోడియాకు బెయిల్ మంజూరు చేసేందుకు రౌస్ ఎవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి ఎంకే నాగ్‌పాల్ నిరాకరించారు.కేసు విచారణ ప్రస్తుతం కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేశారు.
ఈడీ తరఫున న్యాయవాది జొహెబ్ హొస్సేన్.. సిసోడియా తరఫున న్యాయవాది దయన్ కృష్ణన్ వాదనలు వినిపించారు. సిసోడియా బెయిల్ అప్లికేషన్ ను అంగీకరించవద్దని కోర్టుకు ఈడీ తరఫు న్యాయవాది జొహెబ్ హొస్సేన్ కోరారు. లిక్కర్ పాలసీకి ప్రజల ఆమోదం కూడా ఉందని నిరూపించేందుకు నకిలీ ఈమెయిల్స్ ను మనీశ్ సిసోడియా సృష్టించారని కోర్టుకు తెలిపారు. మనీలాండరింగ్ కేసులో ఆయన పాత్రపై తాజాగా మరిన్ని కొత్త ఆధారాలు కూడా లభించాయని చెప్పారు.
ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ రూపకల్పన, అమలులో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇందులోనే సిసోడియాను ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్ట్ చేయగా, మార్చి 9న ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు సీబీఐ, ఈడీలు మనీశ్ సిసోడియాను ప్రశ్నించాయి. సీబీఐ కేసులో బెయిలు కోసం సిసోడియా చేసిన దరఖాస్తును మార్చి 31న స్పెషల్ జడ్జి తోసిపుచ్చారు. ప్రస్తుతం ఆయన బెయిలు దరఖాస్తుపై ఢిల్లీ హైకోర్టు విచారణ జరుపుతోంది. ఈడీ చేసిన ఆరోపణల ప్రకారం, కుట్రపూరితంగానే ఈ ఎక్సయిజ్ విధానాన్ని రూపొందించి, అమలు చేశారు.