'అనదర్ అదానీ స్టోరీ'.. బొగ్గు కొనుగోళ్లపై రాహుల్ ఫైర్ (వీడియో)

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-19 14:16:20.0  )
అనదర్ అదానీ స్టోరీ.. బొగ్గు కొనుగోళ్లపై రాహుల్ ఫైర్ (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ విద్యుత్ ఛార్జీలు పెంచి అదానీ జేబులు నింపుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం ఢిల్లీ ఏఐసీసీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన రాహుల్.. అనదర్ అదానీ స్టోరీ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అదానీ ఇండోనేషియాలో కొనుగోలు చేసిన బొగ్గు ధర ఇండియాలోకి వచ్చే సమయానికి దాని ధర రెట్టింపు అవుతోందని ఆరోపించారు.

ఈ విషయం తాను చెప్పడం లేదని ‘అదానీ మిస్టీరియస్ కోల్ ప్రైసెస్’ పేరుతో ఫైనాన్సియల్ టైమ్స్ లండన్ పేపర్‌లో ఆర్టికల్ వచ్చిందని ప్రెస్ మీట్‌లో సదరు పత్రికను చూపించారు. బొగ్గు ధరల వ్యత్యాసం కారణంగా భారత దేశంలో కరెంటు ధరలు పెరుగుతున్నాయని పేద ప్రజల నుంచి అదానీ రూ.12,000 కోట్ల లాభం పొందారని ఆరోపించారు. ఇది భారత ప్రధాని పదే పదే రక్షించే వ్యక్తి చేస్తున్న ప్రత్యక్ష దొంగతనం అన్నారు. దీనిపై బయటి ప్రపంచానికి చెప్పేందుకు భారత్ లోని మీడియా ఎందుకు ఆసక్తి చూపడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రధాని ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అదానీని రక్షిస్తున్నది ప్రధానియే అని దేశ ప్రజలకు అర్థమైందన్నారు.

Advertisement

Next Story

Most Viewed