నిరసనకారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డ వృద్ధ మహిళ (వీడియో)

by Mahesh |
నిరసనకారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డ వృద్ధ మహిళ (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: MSP కోసం చట్టంతో పాటు మొత్తం 22 పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా హామీ కోరుతూ.. పంజాబ్, హర్యానా, రైతులు ఢిల్లీలో నిరసన కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో మూడు ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. అలాగే ఎక్కడిక్కడ నిరసనకారులను అడ్డుకుని అదుపులోకి తీసుకుంటున్నారు. అయినప్పటికీ ముందస్తు ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్న నిరసనకారులు ఆయా ప్రాంతాల్లో రోడ్లపైకి చేరుకుని తమ నిసనను తెలుపుతున్నారు. దీంతో పంజాబ్ లోని ఓ ప్రధాన రహదారిపై భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారిలో ఓ వృద్ధ మహిళ తన వాహనం నుంచి బయటకు వచ్చి నిరసనకారులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. నిరసనల పేరుతో సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారిని హెచ్చరించింది. అలాగే ఇలా చేయడం నిరసనకారులకు సమంజసం కాదని.. ఏదైనా ఉంటే ప్రభుత్వాలతో చర్చించాలని.. ఇలా తమను ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రశ్నించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో వృద్ధ మహిళ ప్రశ్నలకు నిరసనకారులు ముఖం చాటేయడం కనిపించింది

ఇదిలా ఉంటే.. రైతుల చలో ఢిల్లీ కార్యక్రమం తో అప్రమత్తమైన పోలీసులు.. రాజధాని ఢిల్లీ నగరానికి వచ్చే అన్ని ప్రధాన రహదారులపై కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అలాగే పలు మార్గాలను పూర్తిగా మూసివేసి భారీ ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా.. ఫిబ్రవరి 13న 'ఢిల్లీ చలో' మార్చ్‌కు ముందు వచ్చే 30 రోజుల పాటు ఢిల్లీ నగరం మొత్తం 144 సెక్షన్ విధించినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే వెంటనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story