Amit Shah: మౌలిక సదుపాయాలకు బదులు ‘శీష్ మహల్’ నిర్మించారు.. కేజ్రీవాల్‌పై అమిత్ షా ఫైర్

by vinod kumar |
Amit Shah: మౌలిక సదుపాయాలకు బదులు ‘శీష్ మహల్’ నిర్మించారు.. కేజ్రీవాల్‌పై అమిత్ షా ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌(Aravind Kejriwal) పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith shah) తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశ రాజధానిలో కేజ్రీవాల్ మౌలిక సదుపాయాలు కల్పించలేదని కానీ తన కోసం మాత్రం ‘శీశ్ మహల్’ (Sheesh mahal) నిర్మించుకున్నారని ఆరోపించారు. ఢిల్లీలో కొత్తగా నిర్మించిన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ బ్లాక్ సుష్మా భవన్‌ను అమిత్ షా శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేజ్రీవాల్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రభుత్వ కారు కొనబోమని, ప్రభుత్వ బంగ్లా కొనబోమని చెప్పారని.. కానీ నేడు రూ.45 కోట్లతో శీష్ మహల్ నిర్మించారని తెలిపారు.

నూతన రాజకీయాలకు నాంది పలుకుతానని చెప్పి అవినీతికి పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. శీష్ మహల్ నిర్మాణానికి ఎంత ఖర్చు చేశారో ఢిల్లీ ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ సమాధానం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఢిల్లీ ప్రజలకు నీటిని సరఫరా చేసే వ్యవస్థను నిర్మించలేకపోయిందని విమర్శించారు. మద్యం కుంభకోణం, మొహల్లా క్లినిక్ పేరుతో అవినీతి, సీసీటీవీల స్కామ్, బస్సుల కొనుగోలు కుంభకోణం, ప్రయివేటు సౌకర్యాల కోసం పెద్దఎత్తున కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

Advertisement

Next Story