- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Sharad Pawar: ఇండియా కూటమిలో చీలికలు.. శరద్ పవార్ కీలక నిర్ణయం

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో ప్రతిపక్ష ఇండియా కూటమి (Amid INDIA bloc rift)లో చీలకలు ఏర్పడ్డాయన్న ఊహాగానాల మధ్య కీలక పరిణామం జరిగింది. ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్(NCP (SP) chief Sharad Pawar) మరాఠీ సాహిత్య పండుగ, అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించారు. అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనాన్ని మోడీ ప్రారంభించనున్నారు. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని శివసేన (యూబీటీ) నిర్ణయం తీసుకుంది. ఉద్ధవ్ ఠాక్రే వర్గం నిర్ణయంతో ఇండియా కూటమిలో విభేదాలు తలెత్తిన నేపథ్యంలోనే ఈ పరిణామం జరిగింది. గతేడాది డిసెంబరులోనూ శరద్ పవార్ ఇద్దరు రైతులతో కలిసి ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. మహారాష్ట్రలో పండిన దానిమ్మ పండ్లను బహుమతిగా ఇచ్చారు. ఆ సమావేశంలోనే పవార్ ప్రధానికి అధికారికంగా ఆహ్వానం అందించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఫిబ్రవరిలో..
ఫిబ్రవరి 21 నుంచి 98వ మరాఠీ సాహిత్య సమ్మేళనం జరగనుంది. ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో మూడ్రోజులపాటు ఈ సమ్మేళనం కొనసాగనుంది. ఢిల్లీలో ఈ సమ్మేళనం జరగడం ఇదే మొదటిసారి అని పవార్ అన్నారు. ఈ కార్యక్రమం 37వ ఎడిషన్‌ను మాజీ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించారు. 1878లో పూణేలో జస్టిస్ మహాదేవ్ గోవింద్ రనడే 'గ్రంథాకర్ సమ్మేళనం'గా పేరుతో తొలిసారిగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోకమాన్య బాల గంగాధర్ తిలక్, నామ్‌దార్ గోఖలే, విడి సావర్కర్ మరియు కాకాసాహెబ్ గాడ్గిల్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఇటీవలే మరాఠీని శాస్త్రీయ భాషగా గుర్తించడంతో.. ప్రధానమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం సముచితమని మోడీకి పవార్ రాసిన లేఖలో పేర్కొన్నారు. "ఇది మరాఠీ భాష ప్రచారం, అభివృద్ధికి అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది" అని పవార్ అన్నారు.