- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
18,000 మంది ఉద్యోగులను తొలగించనున్న Amazon ..
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ 1మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. 18 వేల మందికి పైగా ఉద్యోగులపై వేటు వేయనుంది. ఇటీవల 10 వేల మంది ఉద్యోగులను తొలగించిన అమెజాన్..తాజాగా మరోసారి ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయం తీసుకుంది. కరోనా సమయం నుండి అధిక సంఖ్యలో నియామకాలు జరుపుతుండటం తో పాటు ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి కారణంగా ఉద్యోగులను తొలగించనున్నట్లు కంపెనీ సీఈవో ఆండీ జెస్సీ ప్రకటించారు. ఈ మేరకు ఉద్యోగులకు ఒక సందేశాన్ని పంపించారు. కంపెనీ చరిత్రలో భారీగా ఉద్యోగాల కోత విధించడం ఇదే తొలిసారి అని జెస్సీ అన్నారు. ఇప్పటికే గత నవంబర్‌లో కొంతమంది ఉద్యోగులను తొలగించిన అమెజాన్...దానికంటే అధికంగా సుమారు 18 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నామని..ఇది చాలా కష్టమైన నిర్ణయమని తెలిసినప్పటికీ తప్పడం లేదని ఆండీ జస్సీ అన్నారు.
అంతేకాకుండా, తొలగించిన ఉద్యోగులకు అన్ని రకాల ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. 5 నెలల జీతం, ఆరోగ్య భీమా, ఇతర ఉద్యోగాల్లో చేరేందుకు సహాయం అందిస్తున్నట్లు వివరించారు. తొలగించే ఉద్యోగాలు ఎక్కువ యూరప్ దేశాల్లో ఉంటుందని స్పష్టం చేశారు. జనవరి 18 నుంచి తొలగించే ఉద్యోగలకు సమాచారం అందిస్తామని తెలిపారు. కంపెనీలో ఒకరు ఈ విషయాన్ని బహిర్గతం చేసినందున...అకస్మాత్తుగా ప్రకటన చేసినట్లు జెస్సీ పేర్కొన్నారు. కాగా, అమెజాన్‌లో ప్రపంచవ్యాప్తంగా 1.5 మిలియన్ల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్షీణించడం కారణంగా తన ఖర్చులను తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఉద్యోగాలపై కోతలు విధించాలని నిర్ణయం తీసుకున్నది.
- Tags
- amazon