‘ఇండియా’ కూటమి సమీకరణాలపై అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు..

by Vinod kumar |   ( Updated:2023-10-19 11:53:21.0  )
‘ఇండియా’ కూటమి సమీకరణాలపై అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు..
X

లక్నో : ‘ఇండియా’ కూటమి సమీకరణాలపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులు రాష్ట్రాల స్థాయిలో లేవని, కేవలం జాతీయ స్థాయిలోనే ఉంటాయని ఆయన తేల్చి చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో పొత్తుల సంగతి తర్వాత చూడొచ్చని.. ప్రస్తుతానికి తాము మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి ఒంటరిగా దిగడంపై ఫోకస్ పెట్టామని వెల్లడించారు.

ఆ రాష్ట్రంలో ఇప్పటికే 31 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించామని తెలిపారు. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ పోల్స్‌లో ‘ఇండియా’ కూటమి పొత్తులు లేవని అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. ‘‘రాష్ట్రాల స్థాయిలో పొత్తులు ఉండవని నాకు తెలిసి ఉంటే.. మధ్యప్రదేశ్‌లో సీట్ల సర్దుబాటు విషయమై మా పార్టీ ప్రతినిధులు కాంగ్రెస్‌తో చర్చలు జరిపేందుకు వెళ్లేవారే కాదు’’ అని ఆయన కామెంట్ చేశారు.

Advertisement

Next Story