- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎయిర్‌టెల్ రీఛార్జ్ ధరలు పెంపు.. కొత్త ప్లాన్స్ వివరాలివీ
దిశ, బిజినెస్ బ్యూరో : మొబైల్ రీఛార్జ్ టారిఫ్ ప్లాన్ల ధరల పెంపు విషయంలో టెలికాం కంపెనీలన్నీ ఏకతాటిపై నడుస్తున్నాయి. టారిఫ్ ప్లాన్ల ధరలను పెంచుతూ రిలయన్స్ జియో ప్రకటన విడుదల చేసిన మరుసటి రోజే(శుక్రవారం) ఎయిర్ టెల్ కూడా అదే విషయాన్ని అనౌన్స్ చేసింది. వివిధ రీఛార్జ్ ప్లాన్లు, వ్యాలిడిటీలను బట్టి టారిఫ్ రేట్లు సగటున 10 నుంచి 21 శాతం మేర పెరుగుతాయని ఎయిర్‌టెల్ వెల్లడించింది. పోస్ట్ పెయిడ్ ప్లాన్ల ధరలను కూడా పెంచుతున్నట్లు తెలిపింది. ఈ పెంపు జులై 3 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఒక్కో వినియోగదారుడి ద్వారా తమకు వచ్చే ఆదాయం (ఏఆర్‌పీయూ) రూ.300కుపైగా ఉండాలని, అందుకే రీఛార్జ్ ప్లాన్ల రేట్లను పెంచుతున్నామని తెలిపింది. రీఛార్జ్ ప్లాన్ల ధరల పెంపుతో తమ వినియోగదారులపై రోజుకు సగటున 70 పైసల కంటే తక్కువ భారమే పడుతుందని ఎయిర్ టెల్ పేర్కొంది.
కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు..
ఎయిర్‌టెల్ రూ.179 ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు రూ.199 అయింది. ఇందులో 2 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, 28 రోజుల పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. రూ.265 ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు రూ.299 అయింది. ఇందులో రోజుకు 1 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు 28 రోజుల పాటు వస్తాయి. రూ.299 ప్లాన్ ఇప్పుడు రూ.349 అయింది. రూ.359 ప్లాన్ రూ.409కి పెరిగింది. రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ.449కి, రూ.455 ప్లాన్ ధర రూ.509కి, రూ.479 రీఛార్జ్ ప్లాన్ ధర రూ.579కి, రూ.549 ప్లాన్ ధర రూ.649కి, రూ.719 ప్లాన్ ధర రూ.859కి, రూ.839 ప్లాన్ ధర రూ.979కి పెరిగాయి. ఇక రూ.1,799 ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ.1,999కి పెరిగింది. రూ.2,999 ప్లాన్ ధర రూ.3,599 అయింది. ఇక ఎయిర్ టెల్ డేటా యాడ్ ఆన్ ప్లాన్ల ధరలు కూడా పెరిగాయి. రూ.19 ప్లాన్ రూ.22, రూ.29 ప్లాన్ రూ.33, రూ.65 ప్లాన్ రూ.77 అయ్యాయి.
కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు..
ఎయిర్ టెల్ పోస్ట్ పెయిడ్ ప్లాన్లు కూడా మారాయి. కొత్తగా ప్రకటించిన రూ.449 పోస్ట్ పెయిడ్ ప్లాన్‌లో అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉంటాయి. ప్రతినెలా 40 జీబీ ఇంటర్నెట్ కూడా వస్తుంది. రూ.549 ప్లాన్‌లో ప్రతినెలా 75 జీబీ ఇంటర్నెట్ వస్తుంది. అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం, 12 నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్, 6 నెలలు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తాయి. రూ.699 ప్లాన్‌లో ప్రతినెలా కుటుంబ సభ్యులందరికీ 105 జీబీ ఇంటర్నెట్ లభిస్తుంది. అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం, 12 నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్, 6 నెలలు అమెజాన్ ప్రైమ్, 2 కనెక్షన్‌ల కోసం వింక్ ప్రీమియం లభిస్తాయి. రూ.1,199 ప్లాన్‌లో పెద్ద కుటుంబాలకు ప్రతినెలా 190 జీబీ ఇంటర్నెట్ లభిస్తుంది. అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం, డిస్నీ+ హాట్‌స్టార్ 12 నెలల పాటు, 4 కనెక్షన్లకు అమెజాన్ ప్రైమ్ లభిస్తాయి.