ప్రయాణికుడి లంచ్‌బాక్స్‌ చూసి రూ.5 లక్షల జరిమానా వేసిన ఎయిర్‌పోర్టు అధికారులు.. ఎందుకంటే..?

by Prasanna |
ప్రయాణికుడి లంచ్‌బాక్స్‌  చూసి రూ.5 లక్షల జరిమానా వేసిన ఎయిర్‌పోర్టు అధికారులు.. ఎందుకంటే..?
X

దిశ, ఫీచర్స్: ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు మాంసం, చేపలు ఎక్కువగా తింటారు. కొన్ని దేశాల్లో వారు అయితే పాములు, తేళ్లు వంటి కొన్ని ప్రమాదకరమైన జీవులను కూడా తింటారు. అయితే నిషేధిత పదార్థాలు దొరికితే కఠిన చర్యలు తీసుకుంటారు. తైవాన్‌లో ఒక వ్యక్తి లంచ్ బాక్స్‌లో నిషేధిత ఆహారాన్ని తీసుకెళ్తున్నందుకు అతన్ని అరెస్టు చేశారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, అతను హాంకాంగ్ నుండి తైవాన్‌కు విమానంలో వెళ్తున్నాడు. విమానాశ్రయంలోని అధికారులు అతని లంచ్ బాక్స్‌ను చెక్ చేయగా, అందులో కాల్చిన పంది మాంసం ఉన్నట్లు వారు కనుగొన్నారు. దీంతో అతనికి రూ.5 లక్షల జరిమానా విధించారు అధికారులు. వెంటనే ఈ జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం..ఆ వ్యక్తి వెంటనే జరిమానా చెల్లించలేదని పేర్కొంది. ఈ కారణంగా అతడిని తిరిగి హాంకాంగ్‌కు పంపించారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు చేయవద్దని ఆదేశించారు. జరిమానా చెల్లించిన తర్వాత మాత్రమే మీరు తైవాన్‌లోకి ప్రవేశించడానికి అనుమతి ఇస్తామని సిఫార్సు చేసారు. ప్రయాణీకుడు తన లంచ్ బాక్స్‌లో కాంటోనీస్ తరహా కాల్చిన మాంసంతో ఏప్రిల్ 30న తైపీకి తెచుకున్నాడని వార్తా సంస్థలు గత ఆదివారం నివేదించాయి.

ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన ఫోటోల ప్రకారం, ఈ డిష్‌లో కాల్చిన పంది మాంసం, బియ్యం, సోయా సాస్‌తో చికెన్ ఉన్నాయి. రెండూ సాధారణ వంటకాలు.ఆ వ్యక్తి విమానాశ్రయానికి చేరుకోగానే కస్టమ్స్ కుక్క మాంసం వాసన చూసి అధికారులకు సమాచారం అందించింది. అనంతరం జరిమానాను విధించారు.

Advertisement

Next Story