Mumbai airport: సిబ్బందిపై ప్రయాణికురాలి దాడి

by Shamantha N |
Mumbai airport: సిబ్బందిపై ప్రయాణికురాలి దాడి
X

దిశ, నేషనల్ బ్యూరో: ముంబై విమానాశ్రయంలో(Mumbai airport) సిబ్బందిపై మహిళ దాడి చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్(Air India Express) కౌంటర్ వద్ద మహిళా సిబ్బందిపై ప్రయాణికురాలు దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 1న, ముంబై విమానాశ్రయంలో(Mumbai airport) గ్రౌండ్ ఆపరేషన్స్ పార్టనర్‌తో మహిళా ప్రయాణికురాలు అనుచితంగా ప్రవర్తించింది. డ్యూటీ మేనేజర్ వెంటనే సీఐఎస్ఎఫ్(CISF)కి సమాచారం అందించారు. ఆ తర్వాత స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారం ప్రయాణికురాలిని పోలీసులకు అప్పగించినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ప్రతినిధి ప్రకటనలో పేర్కొన్నారు.

ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఏమందంటే?

ప్రైయారిటీ బోర్డింగ్‌కు సంబంధించిన సమస్యపై ప్రయాణికురాలు(passenger), సిబ్బంది(staff) మధ్య వాగ్వాదం జరిగినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ప్రతినిధి తెలిపారు. మరో వ్యక్తికి చెక్-ఇన్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు.. మహిళా ప్రయాణికురాలిని వేచి ఉండమని కోరినట్లు తెలిసిందన్నారు. కొద్దిసేపు వేచి ఉండమని కోరడంతో ప్రయాణికురాలు రెచ్చిపోయిందని పేర్కొన్నారు. దుర్భాషలాడుతూ ఎయిర్‌లైన్ సిబ్బందిపై దాడికి పాల్పడినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై ఎయిర్‌లైన్స్ స్పందించింది. “మా అతిథులు, ఉద్యోగులు, మా భాగస్వాముల భద్రత, శ్రేయస్సు ప్రమాదంలో పడేసే ఏ ప్రవర్తనకైనా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తన జీరో-టాలరెన్స్ విధానాన్ని(zero-tolerance approach) పాటిస్తుంది” అని ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed