- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిలో బీఆర్ఎస్, టీఎంసీ?.. హస్తం పార్టీ సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు
రాయ్‌పూర్: వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిలో బీఆర్ఎస్, టీఎంసీ వంటి పార్టీలకు చోటు దక్కకపోవచ్చనే ఊహాగానాల మధ్య హస్తం పార్టీ సీనియర్ నేత శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో ప్లీనరీ సమావేశాలకు హాజరైన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్ పర్సన్ వీరప్ప మొయిలీ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాల్లో బలంగా ఉన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి నేతలతో చేయి కలిపే అంశంపై చర్చిస్తామని తెలిపారు. ‘మమత, కేసీఆర్, నితీశ్ కుమార్‌తో పొత్తుపై చర్చిస్తాం. సమస్యలను పరిష్కరించుకుంటాం. అందరితో కలిసి పనిచేయాలని అనుకుంటున్నాం’ అని చెప్పారు.
కాగా, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మూడు రోజుల క్రితమే మమతా బెనర్జీ టీఎంసీ పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. బుధవారం మేఘాలయ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. హింస, కుంభకోణాలే టీఎంసీ సంప్రదాయమని, బీజేపీకి మేలు చేసేందుకే రాష్ట్రంలో టీఎంసీ పోటీ చేస్తోందని ఆరోపించారు. రాహుల్ విమర్శించిన కొద్దరోజులకే టీఎంసీ, బీఆర్ఎస్‌తో పొత్తుపై చర్చిస్తామని వీరప్ప చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
రాహుల్ ఓ దారిలో వెళ్తుండగా.. కాంగ్రెస్ మరో దారిలో వెళ్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు 2024 ఎన్నికల్లో తమ జట్టు ఇదేనంటూ 16 పార్టీల పేర్లను ఎంపీ మాణిక్కం ఠాగూర్ గురువారం ట్విట్టర్‌లో వెల్లడించగా.. అందులో బీఆర్ఎస్, టీఎంసీ పేర్లు లేవు. అయితే ఏయే పార్టీలు కూటమిలో ఉండనున్నాయనేదానిపై ప్లీనరీ సమావేశాల అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.