బీజేపీకి మరో గుడ్ బై.. గౌతం గంభీర్ బాటలో మరో కీలక నేత

by Hajipasha |
బీజేపీకి మరో గుడ్ బై..  గౌతం గంభీర్ బాటలో మరో కీలక నేత
X

దిశ, నేషనల్ బ్యూరో : బీజేపీకి లోక్‌సభ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ షాకిచ్చారు. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన చేసిన ప్రకటనను మరువకముందే.. కమలదళానికి మరో షాక్ తగిలింది. మాజీ కేంద్ర మంత్రి, జార్ఖండ్‌లోని హజారీబాగ్‌కు చెందిన బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా పార్టీకి దూరం కావాలని నిర్ణయించుకున్నారు. తనను బీజేపీ ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించాలని ఆయన శనివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కోరారు. బీజేపీ నుంచి వైదొలగిన తర్వాత కూడా తాను ఆర్థిక, విధానపరమైన అంశాలలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూనే ఉంటానని జయంత్ సిన్హా స్పష్టంచేశారు. తనకెంతో ఇష్టమైన వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణపై సాధ్యమైనంత ఎక్కువగా ఇకపై ఫోకస్ చేస్తానని ఆయన వెల్లడించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని తాను నిర్ణయించుకున్నట్లు తెలిపారు. గతంలో ఆర్థిక, పౌర విమానయాన శాఖల సహాయ మంత్రిగా తనకు క్యాబినెట్‌లో అవకాశమిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జయంత్ సిన్హా కృతజ్ఞతలు తెలిపారు.గత పదేళ్లుగా హజారీబాగ్‌ ప్రజలకు సేవ చేసే భాగ్యం తనకు లభించిందన్నారు.

Advertisement

Next Story

Most Viewed