Actor Darshan: కన్నడ నటుడు దర్శన్ కు మధ్యంతర బెయిల్

by Shamantha N |   ( Updated:2024-10-30 06:14:07.0  )
Actor Darshan: కన్నడ నటుడు దర్శన్ కు మధ్యంతర బెయిల్
X

దిశ, నేషనల్ బ్యూరో: కన్నడ నటుడు దర్శన్ తూగుదీపకు హత్య కేసులో కాస్త ఊరట దక్కింది. అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో(Renukaswamy murder case) అరెస్టయి జైలుకెళ్లిన ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరయ్యింది. ఆయనకు కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) మధ్యంతర బెయిల్‌ (interim bail) మంజూరు చేసింది. సర్జరీ కోసం ఆరు వారాల పాటు బెయిల్‌ మంజురు చేస్తూ బుధవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్, నటి పవిత్రగౌడ సహా 16మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పవిత్ర గౌడకు సంబంధించిన అసభ్యకర ఫొటోలు పంపించాడన్న ఆరోపణల్లో దర్శన్‌ అండ్ టీం రేణుకాస్వామిని బెంగళూరుకు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్రదుర్గకు తీసుకెళ్లి దారుణంగా హత్య చేసిందని విచారణలో తేలింది.

రేణుకా స్వామి హత్య కేసు

నటి పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపాడన్న కారణంతో రేణుకా స్వామిని దారుణంగా కొట్టి, కరెంటు షాక్‌లు ఇచ్చి చంపినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. రేణుకా స్వామి శరీరంపైనా అనేక గాయాలను కూడా గుర్తించారు. ఇకపోతే, నిందితులంతా ప్రస్తుతం బెంగళూరులోని వివిధ జైళ్లలో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇక ఈ కేసులో దర్శన్‌తోపాటు పవిత్ర బెయిల్ కోసం బెంగళూరు కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం వీరి అభ్యర్థనను తిరస్కరించింది. వారి బెయిల్‌ పిటిషన్‌ను బెంగళూరు కోర్టు కొట్టివేసింది. దీంతో దర్శన్‌ ఇటీవలే కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అనారోగ్య కారణాలు చూపుతూ దర్శన్‌ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. నటుడి ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని ఆరు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది.

వీఐపీ ట్రీట్మెంట్

పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ప్రత్యేక సౌకర్యాలు వీఐపీ ట్రీట్ మెంట్ కేసుకు సంబంధించి క‌న్నడ హీరో దర్శన్, గ్యాంగ్‌స్టర్ నాగరాజ్, మరో గ్యాంగ్‌స్టర్‌పైనా కేసు నమోదైంది. జైలులో ప్రత్యేక సదుపాయాలు కల్పించారనే ఆరోపణలతో ఏడుగురు అధికారులను కర్ణాటక ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జైలు లోపల దర్శన్ ఓ కుర్చీలో కూర్చుని సిగరెట్ తాగుతూ వున్న ఫొటో ఒకటి బయటకు రావడంతో ఈ విషయం బయటపడింది. అలానే ఆయన వీడియోకాల్ మాట్లుడుతున్న ఫొటో కూడా వైరల్ గామారింది. దీనిపైనా కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed