Congress vs BRS: దమ్ముంటే రండి.. నేను రెడీ : పాడి కౌశిక్ రెడ్డి

by Rani Yarlagadda |   ( Updated:2024-10-30 09:16:53.0  )
Congress vs BRS: దమ్ముంటే రండి.. నేను రెడీ : పాడి కౌశిక్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: జన్వాడ ఫాంహౌస్ లో రేవ్ పార్టీ (Janwada Rave Party) ఘటన చుట్టూ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి. సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాష్ట్రం హీటెక్కుతోంది. కాంగ్రెస్ నేతలు బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలని బీఆర్ఎస్ నేతలు సవాల్ చేయడంతో.. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ (Balmuri Venkat), ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ లు హైదర్ గూడ (Hyderguda) అపోలో ఆస్పత్రికి (Apollo Hospital) వెళ్లి బ్లడ్ శాంపిల్స్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు బ్లడ్ టెస్టులు చేయించుకునేందుకు భయపడుతున్నారని వ్యాఖ్యలు చేయడంతో ఆ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు.

డ్రగ్స్ టెస్టు (Drug Test)కు తాను సిద్ధమేనని, ఎక్కడికి రావాలో అనిల్ యాదవ్ చెప్పాలన్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా ఆస్పత్రులకు వెళ్లడం కాదన్న ఆయన.. దమ్ముంటే ఇప్పుడు కాంగ్రెస్ నేతలంతా ఆస్పత్రికి రావాలని, తాము కూడా వచ్చి టెస్టులు చేయించుకుంటామన్నారు. తన పంచాయతీ అనిల్ కుమార్ యాదవ్ తో కాదని, రేవంత్ రెడ్డితో అని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసులో తనను ఇరికించాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలా సవాళ్లు, ప్రతి సవాళ్లతో తెలంగాణలో రాజకీయం హీటెక్కుతోంది. చివరికి ఎవరికి పాజిటివ్ వస్తుందో, ఎవరు డ్రగ్ ఫ్రీ గా ఉంటారో చూడాలి.

Next Story

Most Viewed