- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Spain: స్పెయిన్ ని అతలాకుతలం చేస్తున్న వర్షాలు
దిశ, నేషనల్ బ్యూరో: స్పెయిన్(Spain) ని భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వరదల వల్ల (flood-hit areas)పలువురు చనిపోగా.. చాలా మంది అచూకీ తెలియాల్సి ఉంది. మరోవైపు వరదల్లో వందలాది కార్లు కొట్టుకుపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక, స్పెయిన్‌లోని వాలెన్సియాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఆచూకీ గల్లంతైన వారి డెడ్ బాడీలు కనుగొన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. మరోవైపు దక్షిణ స్పెయిన్‌లోనూ భారీ వర్షాలు కురిశాయి. దీంతో అక్కడి వీధులు బురద నీటితో నిండిపోయాయి. వరదల కారణంగా పలువురు తప్పిపోయినట్లు అధికారులు తెలిపారు. తప్పిపోయిన వారి కోసం డ్రోన్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
10 విమానాలు రద్దు
అంతేకాకుండా 12 విమానాలను దారి మళ్లించగా.. 10 విమానాలను రద్దు చేసినట్లు స్పెయిన్ అధికారులు తెలిపారు. అదేవిధంగా రైళ్ల రాకపోకలను సైతం నిలిపివేశారు. మరోవైపు, అండలూసియాలో 276 మంది ప్రయాణికులతో వస్తున్న హైస్పీడ్ రైలు పట్టాలు తప్పింది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు. మరోవైపు, సహాయక చర్యల కోసం స్పెయిన్ ప్రభుత్వం సంక్షోభ కమిటీని ఏర్పాటుచేసింది. కమిటీ సభ్యులు మంగళవారం సమావేశమై పరిస్థితులపై చర్చించారు. ‘ గల్లంతైన వారు, తుపాను కారణంగా సంభవించిన నష్టం గురించి ఆందోళన చెందుతున్నా.. అధికారుల సలహాలను ప్రజలు అనుసరించాలి. అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండండి’ అని స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇదిలాఉండగా.. స్పెయిన్ వాతావరణ సంస్థ వాలెన్సియా ప్రాంతంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. విద్యాసంస్థలు మూసివేస్తున్నట్లు తెలిపింది.