Thieves : వడ్ల కుప్పలను మాయం చేస్తున్న దొంగలు..

by Sumithra |
Thieves : వడ్ల కుప్పలను మాయం చేస్తున్న దొంగలు..
X

దిశ, కరీంనగర్ రూరల్ : కరీంనగర్ మండలం దుర్శేడ్ P.A.C.S పరిధిలో ఉన్న ఇరుకుల్ల ఐకేపీ సెంటర్లలో వడ్ల కుప్పలు మాయం చేస్తున్నారు దొంగలు. సెంటర్లు ప్రారంభమై నాలుగు రోజులు అవుతున్నా అలాట్మెంట్ రాక కొనుగోలు ఆలస్యం అవడంతో ఈ విషయాన్ని ఆసరాగా చేసుకొని దొంగలు రెచ్చిపోతున్నారు. కష్టపడి శ్రమించి పండించిన పంట దొంగల పాలు అవడంతో రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు నలుగురు రైతుల వడ్లు సుమారుగా నాలుగు నుండి ఐదు క్వింటాల వడ్లు ఎత్తుకెళ్లినట్టు రైతులు తెలిపారు. వెంటనే కొనుగోలు ప్రారంభించి, సెంటర్లలో విద్యుత్ దీపాలు అమర్చి, మళ్ళీ దొంగతనాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని చైర్మన్ తోట తిరుపతిని కోరారు రైతులు.

Advertisement

Next Story