- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Gram Panchayat : మూడా విస్తరణతో గ్రామపంచాయతీల హక్కులను హరిస్తున్నారు..
దిశ, జడ్చర్ల : మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ మూడ విస్తరణ పేరుతో గ్రామపంచాయతీల ఆదాయానికి గండి కొట్టడంతో పాటు గ్రామ పంచాయతీల హక్కులను హరిస్తున్నారని, వెంటనే మూడాలో నుండి గ్రామపంచాయతీలకు మినహాయింపు ఇవ్వాలని సర్పంచ్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రణీల్ చందర్ డిమాండ్ చేశారు. జడ్చర్ల పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలను, గ్రామాలను మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ విస్తరణ పేరుతో విలీనం చేసి గ్రామపంచాయతీల హక్కులను, వాటి ఆదాయానికి గండి కొడుతున్నారని అన్నారు. గ్రామపంచాయతీ నుండి నిధులను మూడాకు చెల్లించి మళ్లీ తమ గ్రామానికి నిధులు ఇవ్వండని అడుక్కునే పరిస్థితి తలెత్తుతుందని అన్నారు. గ్రామ పంచాయతీల నుండి అధికంగా నిధులు తీసుకున్న మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ వారు కేవలం మున్సిపాలిటీలకు మాత్రమే సింహభాగం నిధులు కేటాయించి గ్రామాలకు మాత్రం పట్టించుకోవడంలేదని అన్నారు.
గ్రామాల్లో ఏదైనా చిన్న సమస్య వచ్చినా మూడా ఆఫీస్ వద్దకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని, గ్రామపంచాయతీలో రెండు మూడు వేళలో అయిపోయే పని మూడాల్లో కలిశాక 40, 50 వేల వరకు ఖర్చు అవుతుందని అన్నారు. వీటితో పాటుగా గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధికి నోచుకోకపోగా ఎలాంటి హక్కులు లేని పాలకులుగా గ్రామాల సర్పంచులు, అధికారులు మిగిలిపోతారని అన్నారు. ఇక్కడి ప్రాంత బిడ్డగా ఉన్న ముఖ్యమంత్రి వెంటనే స్పందించి మూడాలో నుండి గ్రామపంచాయతీలకు మినహాయింపు ఇచ్చి గ్రామ పంచాయతీలకు స్వేచ్ఛ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై పంచాయతీరాజ్ కమిషనర్ కు, పంచాయతీరాజ్ మంత్రికి లేఖ ఇవ్వనున్నామని ప్రణీలు చందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మూల డైరెక్టర్, మండల పార్టీ బీఆర్ఎస్ అధ్యక్షుడు రఘుపతి రెడ్డి, ఆఫీజ్ ఉర్ రెహమాన్, బాలు తదితరులు ఉన్నారు.