Accident: జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు బోల్తా.. ఏడుగురు మృతి

by Ramesh Goud |   ( Updated:2024-11-21 06:56:04.0  )
Accident: జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు బోల్తా.. ఏడుగురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: జార్ఖండ్(​​Jharkhand) లోని హజారీబాద్(Hazaribad) ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం(Terrible Road Accident) సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఏడుగురు మృతి(Seven People Died) చెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. విశాల్ ట్రావెల్స్(Vishal Travels) అనే ప్రైవేట్ బస్సు కోల్‌కతా(Kolkatha) నుంచి జార్ఖండ్ మీదుగా పాట్నా(Patna) వెళుతోంది. గురువారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో హజారీబాద్ బాగ్ వద్దకు రాగానే హైవేపై రోడ్డు పక్కన ఉన్న గుంతను తప్పించబోయి, అదుపుతప్పి బోల్తా పడింది.

పెద్ద శబ్ధం రావడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గోర్హర్ పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీసుల సహాయంతో క్షతగాత్రులను బస్సు నుంచి బయటకి తీసి, స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందగా.. మరో 24 మందికి పైగా తీవ్రంగా గాయ పడ్డారని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఓ పోలీస్ అధికారి తెలిపారు. అలాగే ఘటనపై కేసు నమోదు చేసుకొని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed