- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇదంతా బీజేపీ కుట్రే.. స్వాతి మలివాల్ కేసుపై ఆప్ ఆరోపణలు
దిశ, నేషనల్ బ్యూరో: సంచలనం సృష్టించిన స్వాతి మలివాల్ దాడి కేసుపై ఎట్టకేలకు ఆప్ స్పందించింది. స్వాతి మలివాల్ బీజేపీకి తొత్తుగా మారారని ఢిల్లీ మంత్రి అతిషి ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ.. ఎలాంటి అపాయింట్ మెంట్ లేకుండా మే 13న కేజ్రీవాల్ నివాసానికి స్వాతి మలివాల్ వచ్చారని తెలిపారు. అక్కడే ఉన్న భద్రతా సిబ్బందిని బెదిరించారని ఆరోపించారు. కేజ్రీవాల్ ఇంటి నుంచి లీక్ అయిన సీసీ వీడియో గురించి ప్రస్తావించారు. స్వాతి మలివాల్ భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగడం కన్పిస్తోందని అన్నారు. ఈ వీడియో స్పష్టంగా ఉందని, స్వాతి మలివాల్ పేర్కొన్న ఎఫ్ఐఆర్ అంతా అబద్ధమని చెప్పింది.
స్వాతి మలివాల్‌ని వెయిటింగ్ రూంలో వేచి ఉండాల్సిందిగా చెప్పినా కూడా ఆమె ఆగకుండా డ్రాయింగ్ రూంలోకి ప్రవేశించిందని తెలిపారు అతిషి. స్వాతిని అడ్డుకునేందుకు భిభవ్ కుమార్ వచ్చారని పేర్కొన్నారు. ఇదంతా బీజేపీ ప్లాన్ అని ఆరోపించారు. ఆ సమయంలో కేజ్రీవాల్ ఇంటిలో లేకపోవడంతో అతనికి పెద్ద ప్రమాదం తప్పిందని అన్నారు. జైలు నుంచి రిలీజ్ అయి వచ్చినప్పట్నుంచి కేజ్రీవాల్‌కి జనాదారణ పెరిగిందన్నారు. కేజ్రీవాల్ కు పెరుగుతున్న జనాదరణతో బీజేపీ రగిలిపోతోందని తెలిపారు. అందుకే, ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేశారు.
మరోవైపు, ఈ వ్యవహారంపై బీజేపీ ఆప్‌ని టార్గెట్ చేస్తోంది. కేజ్రీవాల్ నిందితుడు బిభవ్ కుమార్‌ని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపిస్తోంది. కేజ్రీవాల్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని బీజేపీ ప్రశ్నిస్తోంది.