హెచ్‌3‌ఎన్‌2 వైరస్ లక్షణాలతో మహిళ మృతి

by Sathputhe Rajesh |
హెచ్‌3‌ఎన్‌2 వైరస్ లక్షణాలతో మహిళ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: హాంగ్ కాంగ్ ఫ్లూగా పేర్కొనే హెచ్‌3ఎన్‌2 ఇన్ ఫ్లుయెంజా వైరస్ లక్షణాలతో ఓ మహిళ మృతి చెందడం కలకలం రేపింది. అయితే ఈ వైరస్ లక్షణాలతో కర్ణాటకలో ఇటీవల తొలి మరణం నమోదు కాగా తాజాగా గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో 58 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్న ఆమెను చికిత్స కోసం వడోదరలోని హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయారు. అయితే మహిళ మృతి చెందడానికి ప్రస్తుతం కలవరపెడుతోన్న హెచ్3ఎన్2 వైరస్ కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దీనిపై గుజరాత్ ఆరోగ్యమంత్రి హృషికేష్ పటేల్ స్పందిస్తూ గుజరాత్ లో వారం రోజుల క్రితం వరకు హెచ్3ఎన్2 కేసులు మూడు నమోదయ్యాయని తెలిపారు. మార్చి 10 వరకు గుజరాత్‌లో 80 సీజనల్ ఫ్లూ కేసులు నమోదు కాగా వాటిలో 77 ఇన్ ఫ్లూయెంజా హెచ్1ఎన్1 కేసులని తెలిపారు. మూడు హెచ్3ఎన్2 కేసులు అన్నారు. కాగా ఈ ఫ్లూ లక్షణాలతో ఇప్పటివరకు దేశంలో చనిపోయిన వారి సంఖ్య ఏడుకు చేరింది. కాగా మార్చి నెలఖరు నుంచి ఈ కేసులు తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నట్లు వైద్య రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. కొవిడ్ తరహా లక్షణాలున్న ఈ ఇన్ ఫ్లుయెంజా కేసులతో శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడి హాస్పిటల్ లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇటీవల తెలిపాయి.

Advertisement

Next Story

Most Viewed