- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విలువైన కానుకలతో పాటు రామునికి అత్తారింటి నుంచి వెండి విల్లు!
దిశ, ఫీచర్స్: అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ కోసం ఆలయ సిబ్బంది భారీగా ఏర్పాట్లు చేస్తోంది. జనాలు కూడా ఆలయాన్ని దర్శించుకోవడం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా గర్భవతి మహిళలు డెలివరీ రామ మందిరం ఓపెనింగ్ రోజే ప్లాన్ చేసుకోవడం విశేషం. జనవరి 22 న జరిగే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం ఆలయ ట్రస్ట్ ఇప్పటికే పలువురు ప్రముఖులను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా రాముడికి తన అత్తారింటి నుంచి వెండి విల్లుతో పాటు అందమైన బహుమతులు అందాయంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. వివరాల్లోకెళ్తే.. సీతాదేవి జన్మించిన నేపాల్‌లోని జనక్‌పూర్ నుంచి సుమారు 800 మంది భక్తులు ఏకంగా 500 కానుకల డబ్బాలతో అయోధ్య రామమందిరానికి తరలివచ్చారని సమాచారం. భక్తులు రాముని కోసం వెండి పాదరక్షలు, వెండి విల్లు, బాణం, కంఠహారాలు, గృహోపకరణాలు, పట్టు వస్త్రాలు తీసుకొచ్చారట.