- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: కేజ్రీవాల్‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు.. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందేనని తేల్చిచెప్పిన న్యాయస్థానం
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేయగా.. ఢిల్లీ హైకోర్టు ఆ బెయిల్ ఉత్తర్వులపై మధ్యంతర స్టే విధించింది. బెయిల్ పిటిషన్‌పై తదుపరి ఆర్డర్ వచ్చే వరకు స్టే కొనసాగుతోందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఢిల్లీ హైకోర్టు తీర్పును కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. బెయిల్ ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని కోరారు. కేజ్రీవాల్ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఢిల్లీ సీఎం అభ్యర్థనను తోసిపుచ్చింది. బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు ఆర్డర్ ఇచ్చేవరకు వేచి చూడాలని సూచించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. సుప్రీంలో కూడా ఎదురు దెబ్బ తగలడంతో కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.