పెళ్లి చేసుకునే వయస్సు పెంచుతూ అసెంబ్లీలో సంచలన బిల్లు

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-28 15:44:41.0  )
పెళ్లి చేసుకునే వయస్సు పెంచుతూ అసెంబ్లీలో సంచలన బిల్లు
X

దిశ, వెబ్‌డెస్క్: హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీలో సంచలన బిల్లును ప్రవేశ పెట్టారు. యువతుల వివాహ వయసు పెంచుతూ తీసుకొచ్చిన బిల్లును బుధవారం అసెంబ్లీ ఆమోదించింది. ఇప్పటివరకు 18 ఏళ్లుగా ఉన్న వయసును 21 ఏళ్లకు పెంచారు. ప్రస్తుతం దేశంలో యువతుల వివాహ వయస్సు 18 ఏళ్లుగా ఉంది. చట్టం ప్రకారం 18 ఏళ్లు నిండిన యువతులు ఎవరైనా వివాహం చేసుకోవచ్చు. అంతకంటే ముందు చేసుకుంటే బాల్య వివాహల కింద నేరంగా పరిగణిస్తారు. తాజాగా ఈ నిబంధనను హిమాచల్ ప్రదేశ్ సవరించింది. లింగ సమానత్వం, ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు సవరించేందుకే వివాహ వయస్సును పెంచాల్సిన అవసరం ఏర్పడిందని ఆ రాష్ట్ర మహిళా సాధికారత మంత్రి షాండిల్ పేర్కొన్నారు. చిన్న వయస్సులో గర్భం దాల్చడం వల్ల ఆడపిల్లల ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతోందని అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed