ఆయన భార్యను నాకు అప్పజెప్పండి.. హైకోర్టును ఆశ్రయించిన యువకుడు

by Javid Pasha |
ఆయన భార్యను నాకు అప్పజెప్పండి.. హైకోర్టును ఆశ్రయించిన యువకుడు
X

దిశ, వెబ్ డెస్క్: వేరే వ్యక్తి భార్యను తనకు అప్పజెప్పాలంటూ ఓ యువకుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని బనస్కంద జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బనస్కంద జిల్లాకు చెందిన ఓ వివాహిత కొన్ని నెల కిందట తన భర్తను వదిలేసి వేరే యువకుడితో లేచిపోయింది. అనంతరం ఆ యువకుడితో సహజీవనం చేసింది. ఈ క్రమంలోనే ఆ యువకుడు సహజీవనం చేయడానికి ఒప్పంద పత్రం రాయించి ఆమె సంతకం తీసుకున్నాడు. అలా వారిద్దరూ కలిసి జీవిస్తున్న సమయంలో ఆ వివాహిత తల్లిదండ్రులు వచ్చి ఆమెను వాళ్ల ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం అత్తగారింటికి తీసుకెళ్లి భర్తను ఒప్పించి ఇద్దరిని ఒకటి చేశారు.

దీంతో ఆ వివాహితతో సహజీవనం చేసిన యువకుడు హైకోర్టును ఆశ్రయించాడు. తనతో సహజీవనం చేస్తానని ఆ యువతి ఒప్పందం కుదుర్చుకుందని, కానీ మధ్యలోనే వెళ్లిపోయిందని తెలిపాడు. భర్త, అత్తమామలు, తల్లిదండ్రులు ఆమెను బలవంతంగా తీసుకెళ్లారన్న ఆ యువకుడు.. ఆమెను తనకు అప్పగించాలని కోరాడు. ఈ కేసును విచారించిన జస్టిస్ విఎం.పంచోలీ, జస్టిస్ హెచ్ఎం ప్రచ్ఛక్ లతో కూడిన బెంచ్.. ఆ యువతి భర్త నుంచి విడాకులు తీసుకోనందున సహజీవన ఒప్పందం చెల్లదని తీర్పునిచ్చింది. సదరు యువకుడికి రూ.5 వేల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.


Advertisement

Next Story

Most Viewed