అమెరికా అధ్యక్షులు, అధ్యక్ష అభ్యర్థులే లక్ష్యంగా దాడులు

by S Gopi |
అమెరికా అధ్యక్షులు, అధ్యక్ష అభ్యర్థులే లక్ష్యంగా దాడులు
X

దిశ, నేషనల్ బ్యూరో: గతవారం పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో యునైటెడ్ స్టేట్స్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన దాడి ప్రపంచవ్యాప్తంగా అందరినీ దిగ్భ్రాంతిని గురిచేసింది. ఈ పరిణామం అమెరికా అధ్యక్షులు, ప్రధాన పార్టీ అధ్యక్ష అభ్యర్థులపై జరిగిన ఘటనలపై చర్చకు దారితీసింది. ఈ క్రమంలో అమెరికాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటివరకు పలు ఘటనలు జరిగాయి.

అమెరికా తొలి అధ్యక్షుడు అబ్రహం లింకన్..

అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయ దాడికి గురైన వ్యక్తుల్లో మొదటి అధ్యక్షుడు ఆ దేశ తొలి అధ్యక్షుడు అబ్రహం లింకన్. 1865, ఏప్రిల్ 14న ఆయనపై జాన్ విల్కెస్ బూత్ అనే వ్యక్తి కాల్పులు జరపగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లింకన్ మరణించారు. వాషింగ్టన్‌లోని ఫోర్డ్స్ థియేటర్‌లో 'అవర్ అమెరికన్ కజిన్' ప్రత్యేక ప్రదర్శనకు హాజరైనప్పుడు ఈ దాడి జరిగింది. లింకన్ తల వెనుక భాగంలో తీవ్ర గాయం కారణంగా ప్రాణాలొదిలారు. నల్లజాతీయుల హక్కుల కోసం మద్దతుగా ఉన్నందుకు ఆయనను హత్య చేశారని పేర్కొన్నారు.

20వ అధ్యక్షుడు జేమ్స్ గార్‌ఫీల్డ్..

అధికారం చేపట్టిన ఆరు నెలలకే హత్యకు గురైన రెండో అధ్యక్షుడు గార్‌ఫీల్డ్. 1881, జూలై 2న ఇంగ్లాండ్ వెళ్లేందుకు వాషింగ్టన్‌లోని ఓ రైల్వే స్టేషన్‌కు వెళ్లే సమయంలో చార్లెస్ గితౌ అనే దుండగుడు కాల్పులు జరిపాడు. సుమారు 2 నెలల చికిత్స తర్వాత ఆయన మృతి చెందారు.

25వ అధ్యక్షుడు విలియం మెక్‌కిన్లే..

1901, సెప్టెంబర్ 6న న్యూయార్క్‌లోని బఫెలోలో ప్రసంగం అనంతరం అప్పటి అమెరికా అధ్యక్షుడు మెక్‌కిన్లే పౌరులకు షేక్‌హ్యాండ్ ఇస్తూ ఉన్న సమయంలో రిసీవింగ్ లైన్ గుండా వెళ్తున్న ఓ వ్యక్తి పాయింట్-బ్లాంక్ రేంజ్‌లో ఆయన ఛాతీపై రెండుసార్లు కాల్చాడు. ఆ తర్వాత చికిత్స పొందుతూ సెప్టెంబర్ 14న మెక్‌కిన్లే మరణించారు.

35వ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ..

ప్రథమ మహిళ జాక్వెలిన్ కెనడీతో కలిసి 1963, నవంబర్‌లో డల్లాస్‌ను సందర్శించినప్పుడు జాన్ ఎఫ్ కెనడీపై కాల్పులు జరిగాయి. అత్యంత శక్తివంతమైన రైఫిల్‌తో దుండగులు దాడికి పాల్పడటంతో ఆయన పార్క్‌ల్యాండ్ మెమోరియల్ ఆసుపత్రికి తరలించాక మరణించారు.

వీరు కాకుండా రాబర్ట్ ఎఫ్ కెనడీ, జార్జ్ సి వాలెస్ వంటి అమెరికా అధ్యక్ష అభ్యర్థులపై దాడులు జరిగాయి. వారు ఆయా ఘటనల నుంచి బయటపడ్డారు. అలాగే, ఇతర అమెరికా అధ్యక్షుల్లో జార్జ్ డబ్ల్యూ బుష్, ఆండ్రూ జాక్సన్, థియోడర్ రూజ్‌వెల్ట్, ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్, హ్యారీ ఎస్ ట్రూమన్, రిచర్డ్ నిక్సన్, గెరాల్డ్ ఫోర్డ్‌లపై దుండగుల హత్యయత్నాలు జరిగాయి.

Advertisement

Next Story